Loksabha Results: ఉద్దండులను మట్టికరిపించిన యువ నేతలు
ABN , Publish Date - Jun 05 , 2024 | 04:20 PM
లోక్ సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. అధికార బీజేపీ కూటమి అతి కష్టం మీద మెజార్టీ మార్క్ చేరింది. బీజేపీ ధీమా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. గత పార్లమెంట్ ఎన్నికల్లో 62 సీట్లు సాధించింది. ఈ సారి మాత్రం 33 సీట్లతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది.
లక్నో: లోక్ సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. అధికార బీజేపీ కూటమి అతి కష్టం మీద మెజార్టీ మార్క్ చేరింది. బీజేపీ ధీమా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. గత పార్లమెంట్ ఎన్నికల్లో 62 సీట్లు సాధించింది. ఈ సారి మాత్రం 33 సీట్లతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. సింగిల్‌గా 37 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లను గెలుచుకుంది. ఎస్పీ నుంచి గెలిచిన వారిలో ముగ్గురు ఎంపీల వయస్సు 30 ఏళ్ల లోపే ఉంది. వీరంతా ప్రతిష్ఠాత్మక వర్సిటీల్లో చదువుతున్న వారే. ఉద్దండ నేతలను ఓడించి పార్లమెంట్‌లో అడుగిడబోతున్నారు.
పుష్పేంద్ర సరోజ్
పుష్పేంద్ర సరోజ్ వయస్సు 25 ఏళ్లు మాత్రమే. ఇతని తండ్రి ఇంద్రజీత్ సరోజ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తండ్రి ఎమ్మెల్యే కావడంతో కుమారుడు ఎంపీ స్థానానికి పోటీ చేశారు. లండన్ క్వీన్ మేరీ వర్సిటీలో అకౌంటింగ్, మేనెజ్ మెంట్ డిగ్రీ చేశారు. యూపీలో గల కౌశంబి లోక్ సభ నుంచి పుష్రేంద్ర సరోజ్ పోటీ చేశారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ అభ్యర్థి వినోద్ సొంకర్‌ను మట్టి కరిపించారు. పుష్రేంద్రకు లక్ష మెజార్టీ పైగా వచ్చింది. తన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారిస్తానని పుష్రేంద్ర చెబుతున్నారు.
ఇక్రా హసన్
ఇక్రా హసన్ కైరానా లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఈమె వయస్సు 27 ఏళ్లు 69 వేల ఓట్లతో విజయం సాధించారు. ఈమె కూడా యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో ఒరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, ఇంటర్నేషల్ లాపై పీజీ పూర్తి చేశారు. తన నిజయోకవర్గంలో గల మహిళల సమస్యలపై ఫోకస్ చేస్తానని ఇక్రా హసన్ చెబుతున్నారు.
ప్రియ సరోజ్
ప్రియ సరోజ్‌కు రాజకీయ నేపథ్యం ఉంది. ఈమె తల్లి తుఫానీ సరోజ్ కూతురు. తుఫానీ సరోజ్ మాజీ ఎంపీ అనే సంగతి తెలిసిందే. ప్రియ సరోజ్ సుప్రీంకోర్టులో న్యాయవాది. ఈమె వయస్సు 25 ఏళ్లు. మచిల్‌షార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 35 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు.