Lok Sabha Polls: యూపీలో పార్టీలకు వణుకు పుట్టిస్తున్న ఓటర్లు.. పోలింగ్ శాతంపై టెన్షన్..
ABN , Publish Date - May 08 , 2024 | 12:06 PM
ఢిల్లీలో అధికారంలోకి రావాలంటే యూపీలో గెలవాలి. ఎవరిని అడిగినా ఇదే చెబుతారు. అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఏ పార్టీ ఎక్కువు సీట్లు గెలిస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారానికి దగ్గరవుతుందనేది వాస్తవం. దీంతో ఈ ఎన్నికల్లో యూపీలో సత్తా చాటేందుకు ఎన్డీయే, ఇండియా కూటములు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలుండగా.. మూడు విడతల పోలింగ్ ముగిసింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గడం రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి.
ఢిల్లీలో అధికారంలోకి రావాలంటే యూపీలో గెలవాలి. ఎవరిని అడిగినా ఇదే చెబుతారు. అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఏ పార్టీ ఎక్కువు సీట్లు గెలిస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారానికి దగ్గరవుతుందనేది వాస్తవం. దీంతో ఈ ఎన్నికల్లో యూపీలో సత్తా చాటేందుకు ఎన్డీయే, ఇండియా కూటములు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలుండగా.. మూడు విడతల పోలింగ్ ముగిసింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గడం రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి. పోలింగ్ శాతం తగ్గడం ఏ పార్టీ కొంపముంచుతుందోననే భయం నాయకులను వెంటాడుతోంది. మూడో విడతలో భాగంగా మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని 10 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మూడో విడతలో 57.34 శాతం పోలింగ్ నమోదైంది. సంభాల్ లోక్‌సభ నియోజకవర్గంలో అత్యధికంగా 62.81 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఆ తర్వాత ఎటాలో 59.17శాతం, మెయిన్‌పురిలో 58.59 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ శాతం తక్కువుగా నమోదు కావడంతో ఎన్డీయే, ఇండియా కూటమి నేతల్లోనూ ఆందోళన కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రియల్ 19న జరిగిన మొదటిదశ ఎన్నికల్లో 61 శాతం ఓటింగ్ నమోదైంది. ఇవే నియోజకవర్గాల్లో 2019లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఐదు శాతం ఎక్కువ జరిగింది. ఏప్రిల్ 26న జరిగిన రెండో దశ పోలింగ్‌లో 54.83 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 7.93 శాతం తక్కువ పోలింగ్ నమోదైంది. అలాగే మే7వ తేదీన జరిగిన రెండో దశలో 57.34 శాతం నమోదైంది. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే మూడో విడతలోనూ మూడు శాతం ఓటింగ్ తక్కువుగా నమోదైంది.
Patna: ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఉండాలి
ఎస్పీ కోట ఫిరోజాబాద్‌లో..
యూపీలోని ఫిరోజాబాద్‌లో 58.22 శాతం పోలింగ్ నమోదైంది. 2019కి ముందు ఈ నియోజకవర్గం ఎస్పీకి బలమైన కోటగా ఉండేది. ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి బలమైన కోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఎస్పీ థింక్ ట్యాంక్ అని పిలిచేవారు. ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ ఇక్కడి నుంచి ఈ ఎన్నికల్లో పోటీచేయగా.. బీజేపీ నుంచి ఠాకూర్ విశ్వదీప్ సింగ్, బీఎస్పీ నుంచి చౌదరి బషీర్ బరిలో నిలిచారు. ప్రధాన పోటీ అక్షయ్, విశ్వదీప్ మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. 2019లో ఫిరోజాబాద్ సీటును బీజేపీ కైవసం చేసుకుంది. అంతకు ముందు ఈ స్థానం నుంచి అక్షయ్ యాదవ్ ఎంపీగా ఉన్నారు.
మెయిన్‌పురిలో పరిస్థితి ఇదే..!
యూపీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో మెయిన్‌పురి ఒకటి. ఇక్కడి నుంచి ఇండియా కూటమి తరపున ఎస్పీ నుంచి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈ సీటు ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి సాంప్రదాయక స్థానంగా ఉంది. ములాయం సింగ్ యాదవ్ ఇదే నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎంపీ అయ్యారు. ఆయన మరణానంతరం డింపుల్ ఇక్కడ నుంచి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ నుంచి యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జైవీర్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఈసారి మెయిన్‌పురిలో 58.59 శాతం ఓటింగ్ నమోదైంది.
సంభాల్‌లో అత్యధికం
సంభాల్ లోక్‌సభ స్థానం సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. 2019లో ఇక్కడి నుంచి ఎస్పీ టికెట్‌పై షఫీకర్ రహ్మాన్ బుర్కే విజయం సాధించారు. ఈసారి కూడా ఎస్పీ బుర్కేకి ఎస్పీ టికెట్ ఇచ్చింది, అయితే ఎన్నికల ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే ఆయన మరణించారు. దీంతో సంభాల్ నుండి బుర్కే మనవడు జియావుర్ రెహమాన్ బుర్కేకు ఎస్పీ టికెట్ ఇచ్చింది. బీజేపీ నుంచి పరమేశ్వర్ లాల్ సైనీ, బీఎస్పీ నుంచి సౌలత్ అలీ బరిలో నిలిచారు. అయితే జియావుర్ రెహమాన్ బుర్కే, పరమేశ్వర్ లాల్ సైనీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మూడో దశలో సంభాల్‌లో అత్యధిక ఓటింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గంలో 62.81 శాతం పోలింగ్ నమోదైంది. మూడో దశలో యూపీలో ఎక్కువ పోలింగ్ నమోదైన నియోజకవర్గం ఇదే.
పది స్థానాల్లో..
యూపీలో మూడో విడత పోలింగ్ జరిగిన పది నియోజకవర్గాల్లో మొత్తం 57.34 శాతం పోలింగ్ నమోదైంది. సంభాల్‌లో 62.81 శాతం, హత్రాస్‌లో 55.36 శాతం, ఆగ్రాలో 53.99 శాతం, ఫతేపూర్ సిక్రీలో 57.09 శాతం, ఫిరోజాబాద్‌లో 58.22 శాతం, మెయిన్‌పురిలో 58.59 శాతం, ఇటాహ్‌లో 59.17 శాతం, బదౌన్‌లో 55.80 శాతం. బరేలీలో 57.88 శాతం ఓటింగ్ జరిగింది. మూడో దశలో తక్కువ పోలింగ్ ఆగ్రాలో నమోదైందని అధికారులు తెలిపారు.
యూపీలో మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో మొదటి దశ మినహా మిగిలిన రెండు దశల్లో పోలింగ్‌శాతం తక్కవుగా నమోదు కావడం ఏ పార్టీ కొంప ముంచుతుందనే ఆందోళన పొలిటికల్ పార్టీల్లో నెలకొంది. ఓటింగ్ శాతం తగ్గడం అధికార పార్టీకి కలిసి వస్తుందని బీజేపీ అంటుంటే.. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నవాళ్లే ఎక్కువుగా ఓటింగ్‌లో పాల్గొన్నారని.. దీంతో తమకు పాజిటివ్‌గా ఫలితాలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎవరి మాట నిజమో జూన్4న క్లారిటీ రానుంది.
AIMIM: పది లోక్‌సభ స్థానాల్లో మజ్లిస్ పోటీ
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest National News and Telugu News