Share News

Mamata Banerjee: ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాం.. మమతా బెనర్జీ షాకింగ్ నిర్ణయం..

ABN , Publish Date - Jan 24 , 2024 | 12:58 PM

పశ్చిమ బంగా ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సారి జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని వెల్లడించారు.

Mamata Banerjee: ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాం.. మమతా బెనర్జీ షాకింగ్ నిర్ణయం..

పశ్చిమ బంగా ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సారి జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని 42 సీట్లకు సంబంధించి కాంగ్రెస్‌తో ఎలాంటి సంప్రదింపులు జరగలేదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే పొత్తుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కాంగ్రెస్ తో కలిసి కాకుండా ఈ సారికి ఒంటరిగానే ఎన్నికల బరిలో పోరాడతామని తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర గురించి తనకు సమాచారం లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

కాగా.. మ‌మ‌తా బెన‌ర్జీపై కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌదరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమె అవ‌కాశ‌వాది అని విమర్శించారు. దీదీ స‌హ‌కారం లేకుండానే రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పోటీ చేయాల‌ని ఆయ‌న కోరారు. అధిర్ వ్యాఖ్యలతో ఇండియా కూట‌మి భాగ‌స్వామ్య పార్టీల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. బెంగాల్‌లో కాంగ్రెస్‌కు మ‌మ‌తా బెన‌ర్జీ కేవ‌లం రెండు సీట్లు మాత్రమే ఆఫ‌ర్ చేశార‌ని, సీట్ల కోసం కాంగ్రెస్ వెంప‌ర్లాడ‌ద‌ని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 24 , 2024 | 12:58 PM