Sonia Gandhi: ప్రత్యక్ష రాజకీయాలకు సెలవు.. రాయ్ బరేలి ఓటర్లకు సోనియా భావోద్వేగ లేఖ
ABN , Publish Date - Feb 15 , 2024 | 02:50 PM
కాంగ్రెస్ అగ్ర నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగబోనని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు రాయ్ బరేలి ప్రజలకు సోనియా గాంధీ బహిరంగ లేఖ రాశారు.
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగబోనని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు రాయ్ బరేలి ప్రజలకు సోనియా గాంధీ (Sonia Gandhi) బహిరంగ లేఖ రాశారు. రాజ్య సభకు సోనియా గాంధీ బుధవారం (నిన్న) నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Congress: ఎలక్టోరల్ బాండ్లతో మోదీ ప్రభుత్వం స్కామ్ చేసింది: కాంగ్రెస్
2004 నుంచి రాయ్ బరేలి లోక్ సభ నియోజకవర్గానికి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోట రాయ్ బరేలి. ఇక్కడి నుంచి సోనియా భర్త దివంగత రాజీవ్ గాంధీ, అత్త దివంగత ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ‘రాయ్ బరేలి నియోజకవర్గంతో తమ కుటుంబానికి అనుబంధం ఉంది. మీరు నాకు, నా కుటుంబానికి అండగా నిలిచారు. అనారోగ్య కారణాల వల్ల వచ్చే లోక్ సభ ఎన్నికలో పోటీ చేయడం లేదు అని’ లేఖలో సోనియా గాంధీ ఎమోషనల్ అయ్యారు.
Congress: ఎలక్టోరల్ బాండ్లతో మోదీ ప్రభుత్వం స్కామ్ చేసింది: కాంగ్రెస్
రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ నామినేషన్ వేశారు. తొలిసారి ఎగువ సభకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ స్థానం ఖాళీ అవనుంది. ఆ స్థానంలో సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.