CM Chandrababu: పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

ABN, Publish Date - Dec 17 , 2024 | 07:07 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరంలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Chandrababu: పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 1/10

సుమారు 4 గంటలపాటు పోలవరం ప్రాజెక్టు ప్రాంతమంతా సీఎం చంద్రబాబు కలియతిరిగారు. ఉదయం సుమారు 11.45 గంటలకు హెలికాఫ్టర్‌ దిగిన వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతంపలికారు. మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు గులాబీ పూలతోనూ, పసుపురంగు పూలతోనూ స్వాగతం పలికారు.

CM Chandrababu: పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 2/10

పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 అక్టోబరు నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

CM Chandrababu: పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 3/10

కాలంతో పరుగులు తీస్తూ పనులు చేయాలని ఆకాంక్షిస్తున్నామని.. దానికి అనుగుణంగానే నిర్దిష్ట గడువులోగా వాటిని పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించామని ప్రకటించారు.

CM Chandrababu: పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 4/10

సోమవారం పోలవరం ప్రాజెక్టు క్షేత్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి.. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి.. తర్వాత అధికారులతో సమీక్షించారు. పనులు పరుగులు తీయించేలా దిశానిర్దేశం చేశారు.

CM Chandrababu: పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 5/10

పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర జీవనాడి అని, ఈ ప్రాజెక్టును నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ, కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అధారిటీతో చర్చించామని నిర్మాణ పనులకు దశల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని 2026 నాటికి పూర్తి చేయబోతున్నామని ధీమాగా చెప్పారు.

CM Chandrababu: పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 6/10

డయాఫ్రం వాల్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం పనులను సమాంతరంగా చేపట్టవచ్చని నిపుణులు సూచించారని తెలిపారు.

CM Chandrababu: పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 7/10

దెబ్బతిన్న వాల్‌ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్‌ పనులు జనవరి 2వ తేదీన మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. అందుకు అవసరమైన యంత్ర సామగ్రిని ఇంజనీరింగ్‌ అధికారులు సిద్ధం చేస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.

CM Chandrababu: పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 8/10

వాల్‌ నిర్మాణం 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. 2014-19 మధ్య తమ ప్రభుత్వ కాలంలో 72 శాతం పనులు పూర్తి చేశామని, జగన్ ప్రభుత్వం కేవలం 3.84 శాతం మాత్రమే పూర్తి చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు.

CM Chandrababu: పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 9/10

వైసీపీ ప్రభుత్వ తప్పిదాల కారణంగా ప్రాజెక్టుకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదని దుయ్యబట్టారు. రూ.2,400 కోట్ల నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Chandrababu: పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 10/10

ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలియజేసి మొదటి దశ నిర్మాణానికి రూ.12,157 కోట్లు సాధించామని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో ప్రాజెక్టు పనులు చేయకపోవడం వల్ల రూ.15 వేల కోట్ల నష్టం వచ్చిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated at - Dec 17 , 2024 | 07:08 AM