Pawan Kalyan: గుడివాడలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

ABN, Publish Date - Dec 23 , 2024 | 05:23 PM

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గుడివాడ నియోజకవర్గం పరిధిలోని మల్లాయపాలెం గ్రామంలో సోమవారం పర్యటించారు. గ్రామీణ రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పవన్‌ కల్యాణ్‌ పరిశీలించారు.

Pawan Kalyan: గుడివాడలో  పవన్‌ కల్యాణ్‌ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 1/9

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గుడివాడ నియోజకవర్గం పరిధిలోని మల్లాయపాలెం గ్రామంలో సోమవారం పర్యటించారు. గ్రామీణ రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పవన్‌ కల్యాణ్‌ పరిశీలించారు.

Pawan Kalyan: గుడివాడలో  పవన్‌ కల్యాణ్‌ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 2/9

గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గం పరిధిలోని 44 గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థకు మరమ్మత్తులు చేపట్టారు.

Pawan Kalyan: గుడివాడలో  పవన్‌ కల్యాణ్‌ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 3/9

గ్రామీణ ప్రాంతాల్లో నీటి నాణ్యత లేదన్న విషయం పల్లె పండుగ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ దృష్టికి గుడివాడ శాసనసభ్యుడు వెనిగండ్ల రాము తీసుకురాగా... రూ. 3.8 కోట్ల నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టారు.

Pawan Kalyan: గుడివాడలో  పవన్‌ కల్యాణ్‌ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 4/9

ఫిల్టర్ బెడ్లు పూర్తిగా దెబ్బ తినడంతో పంచాయతీకి రూ. 4 లక్షల ఖర్చు చేసి ఫిల్టర్ బెడ్లు మార్పు చేశారు.

Pawan Kalyan: గుడివాడలో  పవన్‌ కల్యాణ్‌ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 5/9

14 గ్రామాల పరిధిలో ఫిల్టర్ బెడ్ల మార్పు ప్రక్రియ పూర్తి అయిన క్రమంలో సోమవారం పవన్ కల్యాణ్ మల్లాయపాలెం రక్షిత మంచి నీటి సరఫరా కేంద్రం వద్ద క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు.

Pawan Kalyan: గుడివాడలో  పవన్‌ కల్యాణ్‌ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 6/9

స్టోరేజీ ట్యాంక్, ఫిల్టర్ బెడ్లతోపాటు- 14 గ్రామాల్లో మరమ్మతులకు ముందు, తర్వాత నీటి నమూనాలను పరిశీలించారు.

Pawan Kalyan: గుడివాడలో  పవన్‌ కల్యాణ్‌ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 7/9

క్షేత్ర స్థాయి పరిశీలన నిమిత్తం గుడివాడ నియోజకవర్గానికి వచ్చిన పవన్ కల్యాణ్‌కి స్థానిక శాసనసభ్యులు వెనిగెండ్ల రాము ఘన స్వాగతం పలికారు.

Pawan Kalyan: గుడివాడలో  పవన్‌ కల్యాణ్‌ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 8/9

కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వర రావు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ , జిల్లా అధికారులు పాల్గొన్నారు. గుడివాడలో జనసేన, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

Pawan Kalyan: గుడివాడలో  పవన్‌ కల్యాణ్‌ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు 9/9

పవన్ కల్యాణ్‌ను చూడటానికి ప్రజలు, అభిమానులు పోటెత్తారు. పవన్‌కు కూటమి నేతలు వీడ్కోలు పలికారు.. అభిమానులకు అభివాదాలు చేస్తూ.. మంగళగిరికి పవన్ కల్యాణ్ తిరుగు ప్రయాణమయ్యారు.

Updated at - Dec 23 , 2024 | 09:50 PM