Share News

AP Elections: రాజీనామా తర్వాత వలంటీర్లు ఏం చేస్తున్నారో తెలిస్తే..?

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:38 PM

AP Elections 2024: ఎన్నికలు సమీపించేసరికి గ్రామ, వార్డు వలంటీర్లు రాజకీయ ముసుగు తొలగించి, అసలు స్వరూపం బయటపెడుతున్నారు. పింఛన్ల పంపిణీకి దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడంతో..

AP Elections: రాజీనామా తర్వాత వలంటీర్లు ఏం చేస్తున్నారో తెలిస్తే..?

అమరావతి/విశాఖపట్నం: ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపించేసరికి గ్రామ, వార్డు వలంటీర్లు (Volunteers) రాజకీయ ముసుగు తొలగించి, అసలు స్వరూపం బయటపెడుతున్నారు. పింఛన్ల పంపిణీకి దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడంతో స్థానిక రాజకీయ నేతల ఒత్తిళ్లలో మూకుమ్మడిగా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో పెందుర్తి మండలంలో 30 మంది, పరవాడ మండలం తానాంలో 23 మంది రాజీనామా చేశారు. అలాగే అనకాపల్లి జిల్లా కశింకోట పంచాయతీలో అయితే ఏకంగా 89 మంది వలంటీర్లు రాజీనామాలు సమర్పించారు. అదే మండలం బయ్యవరంలో మరో 14 మంది రాజీనామా చేశారు. వీటి వెనుక వైసీపీ నేతల ప్రోద్బలం ఉందనేది సుస్పష్టం. తానాంలో రాజీనామా చేసిన వలంటీర్లు అక్కడి జెడ్పీటీసీ సభ్యుడు పైలా సన్యాసిరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ను కలిశారు. తమ రాజీనామా పత్రాలను ప్రదర్శిస్తూ ‘జై జగన్‌...జైజై అదీప్‌ రాజు...’ అంటూ నినాదాలు చేశారు. జగన్‌ రుణం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేయించారు.

మరీ ఇంతలానా!.. టీడీపీని బద్నాం చేసేందుకు వృద్ధులను వాడేసుకున్న వైసీపీ


Volunteers-Resign-3.jpg

మరీ ఇంతలా..?

ఇన్నాళ్లూ వలంటీర్లు స్వచ్ఛంద సేవకులని వైసీపీ పెద్దలు చెప్పుకొచ్చారు. కేవలం రూ.5 వేల గౌరవ వేతనానికే పనిచేస్తున్నారని వారిని ప్రశంసించారు. కానీ పార్టీ కోసం పనిచేసేలా వారికి శిక్షణ ఇచ్చారు. వారి ద్వారానే గ్రామాలు, వార్డుల్లో ఓటర్ల వివరాలు తీసుకోవడం, ఓటర్లకు కానుకలు పంపిణీ చేయడం చేశారు. నగరంలో కార్పొరేటర్లు, గ్రామాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, నాయకులు వారిని (వలంటీర్లను) పార్టీ క్రియాశీలక కార్యకర్తల్లా భావిస్తున్నారు.

Volunteers-Resign.jpg

రాజీనామా ఎందుకో..?

ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన నేపథ్యంలో నాయకులు ఎక్కడికక్కడే సమావేశాలు నిర్వహించి, వలంటీరు పోస్టుకు రాజీనామాలు చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. అలా చేస్తే నెలకు రూ.15 వేలు వరకు ఇస్తామని ఆశ చూపుతున్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే అందరినీ వలంటీర్లుగా తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. ఈ మూడు నెలలు పార్టీకి పనిచేయాలని, ఏ అధికారి ఏమీ అనకుండా తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు. తమ చేతులు మీదుగానే నియమించిన వలంటీర్లను ఆయా నాయకులు రెండు రోజుల నుంచి ఇళ్లకు పిలిచి మూకుమ్మడిగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. రాజీనామాకు కారణం ఏమి రాశారు? అనే విషయాన్ని అధికారులు వెల్లడించడం లేదు. అధికార పార్టీకి భయపడి ఆ పత్రాలను బయటపెట్టడం లేదు. పోస్టులకు రాజీనామా చేసినవారు ఎన్నికల ఓటర్ల వివరాలు తీసుకోవడం, ఓటర్లకు కానుకలు పంపిణీ చేయడం చేశారు. నగరంలో కార్పొరేటర్లు, గ్రామాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, నాయకులు వారిని (వలంటీర్లను) పార్టీ క్రియాశీలక కార్యకర్తల్లా భావిస్తున్నారు.


Volunteers-Resign-2.jpg

రాజీనామాకు ఒత్తిడి!

ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన నేపథ్యంలో నాయకులు ఎక్కడికక్కడే సమావేశాలు నిర్వహించి, వలంటీరు పోస్టుకు రాజీనామాలు చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. అలా చేస్తే నెలకు రూ.15 వేలు వరకు ఇస్తామని ఆశ చూపుతున్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే అందరినీ వలంటీర్లుగా తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. ఈ మూడు నెలలు పార్టీకి పనిచేయాలని, ఏ అధికారి ఏమీ అనకుండా తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు. తమ చేతులు మీదుగానే నియమించిన వలంటీర్లను ఆయా నాయకులు రెండు రోజుల నుంచి ఇళ్లకు పిలిచి మూకుమ్మడిగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. రాజీనామాకు కారణం ఏమి రాశారు? అనే విషయాన్ని అధికారులు వెల్లడించడం లేదు. అధికార పార్టీకి భయపడి ఆ పత్రాలను బయటపెట్టడం లేదు. పోస్టులకు రాజీనామా చేసినవారు ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించకూడదని అధికారులు హెచ్చరించడం లేదు. అలా చేస్తే ఏ ఉద్యోగాలు రావని కూడా చెప్పడం లేదు. వారు కూడా అధికార పార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు.

1-YCP-ysrcp-copy.jpg

ఇదీ అసలు కారణం?

కేంద్ర ఎన్నికల సంఘం మూడేళ్లకు పైబడిన అధికారులను ఆయా ప్రాంతాల నుంచి బదిలీ చేసినట్టే...గత నాలుగేళ్లుగా గ్రామాలు, వార్డుల్లో పనిచేస్తున్న వలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కాకూడదని స్పష్టంచేసింది. ప్రతి నెలా వీరి ద్వారా ఇంటింటికీ సంక్షేమ పథకాలు, పెన్షన్లు ఇస్తున్నందున ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని, ఆ పనులు కూడా వారికి అప్పగించవద్దని ఆదేశించింది. ఏప్రిల్‌ ఒకటో నుంచి పింఛన్ల పంపిణీ బాధ్యతలు ఇవ్వవద్దని సూచించింది. దీనిని అధికార పార్టీ వైసీపీ జీర్ణించుకోలేకపోయింది. అసలు పింఛన్లు ఇవ్వడానికి నిధులు లేవనే విషయం దాచిపెట్టి, ప్రతిపక్ష పార్టీలు కుట్ర వల్లే ఇదంతా జరుగుతున్నదని దుష్ప్రచారం ప్రారంభించింది. పేదలు, వృద్ధులకు పింఛన్లు సకాలంలో ఇవ్వడం కష్టమేనని ప్రచారం ప్రారంభించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో నేటి నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేసింది. ఎక్కడ చూసినా వృద్ధులకు ఇబ్బందులే.. పైకి మాత్రం మంచాల మీద తీసుకెళ్తూ వైసీపీ షో చేస్తుండటం గమనార్హం.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 03 , 2024 | 02:42 PM