Share News

Viral Video: ఎలుగుబంటికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. పులిని ఎలా హడలెత్తించిందో చూస్తే..

ABN , Publish Date - Sep 01 , 2024 | 05:50 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వేట కోసం వేచి చూస్తున్న రాయల్ బెంగాల్ టైగర్‌కు అనుకోకుండా ఓ ఎలుగు బంటి ఎదురుపడుతుంది. దీంతో దానిపై తన ప్రతాపం చూపించాలని అనుకుంటుంది. ఉన్నట్టుండి ..

Viral Video: ఎలుగుబంటికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. పులిని ఎలా హడలెత్తించిందో చూస్తే..

పులులు, సింహాలు, హైనాలు, ఎలుగుబంట్లు తదితర జంతువుల్లో ఏవి పవర్‌ఫుల్ అంటే.. వెంటనే పులులు, సింహాలు అని చెబతాం. కానీ సమయం, సందర్భా్న్ని బట్టి కొన్నిసార్లు చిన్న జంతువులు కూడా తమ ప్రతాపాన్ని చూపిస్తుంటాయి. కొన్నిసార్లు పులులు, సింహాలను సైతం మిగతా జంతువులు తరిమి తరిమి కొట్టిన సందర్భాలు చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎలుగుబంటిపై దాడికి దిగిన రాయల్ బెంగాల్ టైగర్ పరిస్థితి చివరకు ఏమైందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వేట కోసం వేచి చూస్తున్న రాయల్ బెంగాల్ టైగర్‌కు అనుకోకుండా ఓ ఎలుగు బంటి ఎదురుపడుతుంది. దీంతో దానిపై తన ప్రతాపం చూపించాలని అనుకుంటుంది. ఉన్నట్టుండి ఎలుగుబంటిపై మెరుపు దాడి చేస్తుంది. పులి దాడితో ఎలుగుబంటి అలెర్ట్ అవుతుంది. వెంటనే తేరుకుని పులిపై ఎదురుదాడి చేస్తుంది.

Viral Video: నీటిలో హిప్పో పవర్ ఎలా ఉంటుందో తెలుసా.. సింహం కంటపడడంతో ఏం చేసిందో చూడండి..


ఎలుగు బంటి తన ముందు కాళ్లతో (bear attacked Royal Bengal Tiger) పులితో బాక్సింగ్ చేసింది. ఎలుగు పంజా దెబ్బకు పులి హడలెత్తిపోయింది. కాసేపుంటే ఎలుగు చేతిలో ప్రాణాలు పోవడం ఖాయం.. అనుకుందో ఏమో గానీ.. అక్కడి నుంచి పరుగందుకుంది. ఇలా ఎలుగు బంటి చేతిలో ఘోరంగా ఓటమిపాలైన బెంగాల్ టైగర్.. కాళ్లకు బుద్ధి చెప్పాల్సి వచ్చింది.

Viral Video: జంగిల్ సఫారీలో పులిని వీడియో తీస్తుండగా షాకింగ్ సీన్.. చివరకు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలుగుబంటి పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘పులికి చుక్కలు చూపించిన ఎలుగు’’.. అంటూ మరికొందరు, ‘‘పులి వెనుక్క తగ్గడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Optical illusion: మీ కంటి చూపు బాగుందో లేదో చెక్ చేసుకోండి.. ఈ వృత్తం వెనుకున్న సంఖ్య ఏంటో 10 సెకన్లలో చెప్పగలరా..?


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 01 , 2024 | 05:50 PM