Share News

Viral Video: పెళ్లి దుస్తుల్లో ఇదేం పాడు పని.. కెమెరా ఆన్ చేసుకుని మరీ ఈమె చేస్తున్న నిర్వాకం..

ABN , Publish Date - Aug 03 , 2024 | 11:49 AM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వ్యూస్, లైక్‌ల కోసం ఎవరు, ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేని పరిస్థితి. చివరకు యువకులతో పాటూ యువతులు కూడా చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. ఇక వివాహ కార్యక్రమాల్లో ..

Viral Video: పెళ్లి దుస్తుల్లో ఇదేం పాడు పని.. కెమెరా ఆన్ చేసుకుని మరీ ఈమె చేస్తున్న నిర్వాకం..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వ్యూస్, లైక్‌ల కోసం ఎవరు, ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేని పరిస్థితి. చివరకు యువకులతో పాటూ యువతులు కూడా చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. ఇక వివాహ కార్యక్రమాల్లో వధూరుల ప్రవర్తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. పెళ్లి దుస్తుల్లో ఉన్న వధువు చేసిన పని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వివాహ (marriage) కార్యక్రమంలో ఓ విధువు విచిత్రంగా ప్రవర్తించింది. పెళ్లి దుస్లుల్లో ముస్తాబైన వధువు.. ఉన్నట్టుండి విచిత్రంగా ప్రవర్తించింది. మేకప్ చేసుకుని పెళ్లి దుస్తుల్లో అందగా రెడీ అయిన వధువు.. నోట్లో సిగరెట్ పెట్టుకుని (bride smoking cigarette) గుప్పు గుప్పుమంటూ పొగ పీల్చసాగింది.

Viral Video: వామ్మో..! షాకింగ్ వీడియో... సింహంపైనే స్వారీ చేశాడు.. ఆ వెంటనే..


ఆమె స్మోకింగ్ చేస్తున్న విధానం చూస్తే.. అచ్చం సిగరెట్ అలవాటు ఉన్న వారిలాగానే ఉంది. కెమెరా ఆన్ చేసిన వధువు.. స్టైల్‌గా సిగరెట్ పొగను వదులుతూ ఫోజులిచ్చింది. వధూవరులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం ప్రస్తుతం సర్వసాధారమైపోయింది. వ్యూస్ కోసం కొందరు, అనుకోని పరిస్థితిలో మరికొందరు, వివాహం నచ్చక ఇంకొందరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు.

Viral Video: మానిటర్ బల్లిని కసితీరా కొరికిన నల్ల పాము.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


కాగా, ప్రస్తుతం సిగరెట్ తాగుతున్న వధువు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈమేంటీ.. మరీ విచిత్రంగా ఉందే’’.., ‘‘పెళ్లి తర్వాత ఈమె పరిస్థితి ఏంటో’’.., ‘‘సిగరెట్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉందే’’.. అంటూ కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదేనేమో.. ప్లాట్‌ఫామ్‌పై ఈమె చేసిన పని చూడండి..

Updated Date - Aug 03 , 2024 | 11:49 AM