Viral Video: ఆపదలో ఉన్న వారిని కాపాడటానికి దేవుడే రానక్కర్లేదు.. కొన్నిసార్లు ఇలాక్కూడా జరుగుతుంది..
ABN , Publish Date - Apr 04 , 2024 | 04:03 PM
ఆపదలో ఉన్న వారిని కాపాడానికి దేవుడు స్వయంగా రాకున్నా.. ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తుంటాడు.. అని వింటూ ఉంటాం. దేవుడు ఉన్నాడో, లేడో అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఇలాంటి సన్నివేశాలు మాత్రం నిత్యం ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు..
ఆపదలో ఉన్న వారిని కాపాడానికి దేవుడు స్వయంగా రాకున్నా.. ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తుంటాడు.. అని వింటూ ఉంటాం. దేవుడు ఉన్నాడో, లేడో అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఇలాంటి సన్నివేశాలు మాత్రం నిత్యం ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు అనూహ్య ప్రమాదాల్లో చిక్కుకున్న వారు.. ఊహించని విధంగా ప్రాణాలతో బయటపడుతుంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. ‘‘అరే..! ఇదెలా సాధ్యమైంది’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట కూడా తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ బాలిక నీటిలో మునిగిపోతున్న సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బాలుడు స్విమ్మింగ్‌పూల్లో (Swimming pool) ఈత కొడుతుంటాడు. కాసేపటికి ఓ బాలిక కూడా అక్కడికి వస్తుంది. స్విమ్మింగ్‌పూల్ పక్కనే ఉన్న జారుడుబల్ల పైనుంచి నీటిలోకి దూకుతుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నీటిలోకి దూకిన ఆమెకు ఈత ఆడటం మాత్రం రాదు. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై.. చేతులు ఆడిస్తూ ఉంటుంది. అయినా ఒడ్డుకు రాలేక మునిగిపోతుంటుంది.
ఇదంతా పక్కనే ఉన్న బాలుడు గమనిస్తాడు. పిల్లాడైనా ఎంతో ధైర్యంతో బాలిక వద్దకు ఈతకొడుతూ వెళ్తాడు. చివరకు ఎంతో చాకచక్యంగా (boy saved the girl) ఆమె చేయి పట్టుకుని బయటికి తీసుకొస్తాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. బాలుడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘‘ఈ పిల్లాడు దేవుడి రూపంలో వచ్చాడుగా’’.. అంటూ కొందరు, ‘‘పిల్లాడి ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Optical illusion: తల్లికి కనిపించకుండా దాక్కున్న ముగ్గురు పిల్లలు.. వాళ్లెక్కడ ఉన్నారో చెప్పగలరా..