Viral Video: అయ్యో తాతా.. ఎంత పని జరిగింది.. ఎద్దును తరిమికొట్టాలని చూడగా..
ABN , Publish Date - Dec 08 , 2024 | 09:11 PM
సైలెంట్‌గా కనిపించే చాలా జంతువులు కొన్నిసార్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. ఎద్దులు, ఏనుగులు వంటి పెద్ద పెద్ద జంతువులకు కోపం వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్నిసార్లు అవి మనుషులపై దాడి చేసి చంపేసిన ఘటనలను కూడా చూశాం. ఇలాంటి ..
సైలెంట్‌గా కనిపించే చాలా జంతువులు కొన్నిసార్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. ఎద్దులు, ఏనుగులు వంటి పెద్ద పెద్ద జంతువులకు కోపం వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్నిసార్లు అవి మనుషులపై దాడి చేసి చంపేసిన ఘటనలను కూడా చూశాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వృద్ధుడు ఎద్దును తరిమికొట్టాలని ప్రయత్నించినా చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘అయ్యో తాతా.. ఎంత పని జరిగింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఎద్దు వీధిలో నడుస్తూ వెళ్తుంటుంది. అలా వెళ్తున్న ఎద్దు ఓ చోట ఆగి ఉండగా.. ఓ వృద్ధుడు కర్ర తీసుకుని వచ్చి దాన్ని దూరంగా తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తాడు. కర్రతో ఎద్దును కొడుతూ దూరంగా పంపించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఆ ఎద్దు మాత్రం ఎటూ కదలకుండా అలాగే సైలెంట్‌గా ఉండిపోతుంది.
Optical illusion: ఈ చిత్రంలో ఆమెతో పాటూ మరో రెండు ముఖాలు ఉన్నాయి.. 15 సెకన్లలో కనుక్కంటే మీరే తోపు..
ఎంత కొడుతున్నా ఆ ఎద్దు అలాగే ఉండిపోతుంది. అయితే వృద్ధుడు పదే పదే కర్రతో కొట్టడంతో ఎద్దుకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంటుంది. ఒక్కసారిగా అతడిని కొమ్ములతో (bull attacked an old man) పైకి ఎత్తి కిందపడేస్తుంది. కింద పడగానే ఆ వృద్ధుడు చలనం లేకుండా అలాగే ఉండిపోతాడు. కాసేపటికి గమనించిన ఓ వ్యక్తి అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి వృద్ధుడిని పరిశీలిస్తాడు.
Viral Video: వయసు కేవలం సంఖ్య మాత్రమే.. ఈ పెద్దాయన టాలెంట్ చూస్తే గూస్‌బమ్స్ ఖాయం..
ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం.. ఈ పెద్దాయనకు ఇలా జరిగిందేంటీ’’.. అంటూ కొందరు, ‘‘ఎవరినీ ఆట పట్టించకూడదని ఈ ఘటన మనకు నేర్పుతోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 520కి పైగా లైక్‌లు, 2.34 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వామ్మో.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. కత్తితో ఇతను ఏం చేస్తున్నాడో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..