Viral Video: ఈ ట్రిక్ ఎప్పుడైనా ట్రై చేశారా.. చేతి నుంచి గాజులను ఎలా తీస్తుందో చూస్తే..
ABN , Publish Date - Dec 08 , 2024 | 05:17 PM
బాలికలు, యువతులు, మహిళలు.. ఇలా వయసులో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ చేతికి రంగు రంగు గాజులు వేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. కొందరు ఆధునిక డిజైన్లలో ఉండే గాజులను ధరిస్తుంటారు. అయితే చాలా మంది గాజులు వేసుకోవడం, తీయడంలో కోన్నిసార్లు ఇబ్బందులు పడుతుంటారు. బిగుతుగా ఉన్న గాజులను ..
బాలికలు, యువతులు, మహిళలు.. ఇలా వయసులో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ చేతికి రంగు రంగు గాజులు వేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. కొందరు ఆధునిక డిజైన్లలో ఉండే గాజులను ధరిస్తుంటారు. అయితే చాలా మంది గాజులు వేసుకోవడం, తీయడంలో కోన్నిసార్లు ఇబ్బందులు పడుతుంటారు. బిగుతుగా ఉన్న గాజులను తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ సమస్యకు ఓ మహిళ చక్కటి పరిష్కారాన్ని కనుక్కుంది. చేతికి వేసిన గాజును ఎంతో సులభంగా తీయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ ట్రిక్ ఏదో చాలా బాగుందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చేతికి గాజు వేసుకున్న యువతి (young woman) .. దాన్ని తీసేందుకు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడింది. ఎంత ప్రయత్నించినా గాజు (bangle) తీయడం సాధ్యం కాలేదు. అయితే తాన్ని తీసేందుకు ఓ మహిళ సింపుల్ ట్రిక్ ఉపయోగించింది. ముందుగా యువతి చేతికి ఓ కవర్ తొడిగింది.
Viral Video: ఈ యువతి తెలివి మామూలుగా లేదుగా.. ఉష్ణపక్షులను ఎలా మోసం చేసిందో చూడండి..
ఆ కవర్ చివర్లను గాజు కింద నుంచి అటు వైపునకు లాగింది. ఆ తర్వాత గాజును కొంచెం ముందుకు లాగి, కవర్‌పై కొంచెం కొబ్బెర నూనె రాసింది. చివరగా గాజును బయటికి లాగడంతో అది సింపుల్‌గా బయటికి వచ్చేసింది. ఇలా బిగుతుగా ఉన్న గాజును ఎంతో సులభంగా తీయడం చూసి అంతా అవాక్కవుతున్నారు.
Viral Video: ఈ కోతి మరీ స్మార్ట్ గురూ.. యువతిని చూడగానే పైకి ఎక్కి మరీ.. చివరకు..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘చేతికి సబ్బును రాయడం వల్ల కూడా బిగుతుగా ఉన్న గాజును సులభంగా తీయొచ్చు’’.. అంటూ కొందరు, ‘‘ఈ ట్రిక్ చాలా బాగుంది.. మహిళందరికీ ఉపయోగపడుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లు, 28.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: మృత్యువును కొనితెచ్చుకోవడం అంటే ఇదే.. బైకుపై విన్యాసాలు చేస్తుండగా.. మధ్యలో..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..