Share News

Viral Video: నీళ్లు తాగుతున్న గేదెలు.. సడన్‌గా దూసుకొచ్చిన మొసలి.. చివరకు జరిగింది చూస్తే..

ABN , Publish Date - Dec 18 , 2024 | 07:51 AM

నీటిలో ఉన్న మొసళ్లకు ఎంత పవర్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏలుగు వంటి పెద్ద పెద్ద జంతువులు సైతం వాటి నోటికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సందర్భాలను చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: నీళ్లు తాగుతున్న గేదెలు.. సడన్‌గా దూసుకొచ్చిన మొసలి.. చివరకు జరిగింది చూస్తే..

నీటిలో ఉన్న మొసళ్లకు ఎంత పవర్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏలుగు వంటి పెద్ద పెద్ద జంతువులు సైతం వాటి నోటికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సందర్భాలను చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. గేదెలు నీళ్లు తాగుతుండగా సడన్‌గా ఓ మొసలి దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గేదెల మంద దాహం తీర్చుకోవడానికి ఓ నది వద్దకు వస్తుంది. అన్నీ కలిసి సమూహంగా నదిలోకి దిగి నీళ్లు తాగుతుంటాయి. అయితే అప్పటికే ఓ పెద్ద మొసలి వేట కోసం వేచి చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో నీళ్లు తాగుతున్న గేదెలను చూడగానే ఒక్కసారిగా నీటిలోంచి దూసుకొచ్చింది. మొసలి దాడితో ఉలిక్కిపడిన గేదెలు తలోదిక్కూ పారిపోతాయి.

Viral Video: వ్యూస్ కోసం ఇలా ఎవరైనా చేస్తారా.. రైలు పట్టాలపై అసభ్యకరంగా ఈమె చేసిన పని చూడండి..


అయితే వాటిలో ఓ గేదెను టార్గెట్ చేసిన మొసలి నేరుగా (crocodile attacks buffalo) వెళ్లి దాని గట్టిగా పట్టుకుంటుంది. మొసలి దాడితో ఉక్కిరిబిక్కిరైన గేదె.. తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినా మొసలి దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకుని నీటిలోకి లాగేస్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. పరిస్థితి చూస్తుంటే ఆ గేదె మొసలికి ఆహారమైనట్లు తెలుస్తోంది.

Viral Video: స్నేహమంటే ఇదేరా.. ఇద్దరూ కలిసి సైకిల్ ఎలా తొక్కుతున్నారో చూస్తే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మొసలి పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘సృష్టి ధర్మాన్ని ఎవరూ ఆపలేరు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 47 వేలకు పైగా లైక్‌లు, 2.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పక్కా స్కెచ్ అంటే ఇదే.. ఒడ్డున ఉన్న కుక్కపై మొసలి టార్గెట్.. ఇంతలో వెనుక నుంచి..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 18 , 2024 | 07:51 AM