Share News

Viral Video: వ్యూస్ కోసం ఇలా ఎవరైనా చేస్తారా.. రైలు పట్టాలపై అసభ్యకరంగా ఈమె చేసిన పని చూడండి..

ABN , Publish Date - Dec 17 , 2024 | 01:54 PM

రైల్వే ట్రాకుల మీద పిచ్చి పిచ్చి పనులు చేసే వారిని రోజూ చూస్తుంటాం. కొందరు వ్యూ్స్ కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొందరు తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటివారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇంకొందరు ..

Viral Video: వ్యూస్ కోసం ఇలా ఎవరైనా చేస్తారా.. రైలు పట్టాలపై అసభ్యకరంగా ఈమె చేసిన పని చూడండి..

రైల్వే ట్రాకుల మీద పిచ్చి పిచ్చి పనులు చేసే వారిని రోజూ చూస్తుంటాం. కొందరు వ్యూ్స్ కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొందరు తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటివారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇంకొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రయాణిలందరినీ ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, రైలు పట్టాలపై ఓ మహిళ చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వ్యూస్ కోసం ఇలా ఎవరైనా చేస్తారా’’.. అంటూ కామోంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహెదీ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఓ మహిళ రైలు పట్టాలపైకి వెళ్లింది. చీరను అసభ్యకర స్థితిలో ధరించడమే కాకండా, రైలు పట్టాలపై నడుస్తూ వీడియో చేసింది. అంతటితో ఆగని ఆమె.. ఎదురుగా రైలు రావడాన్ని చూసి కూడా అలాగే నడుస్తూ ఉంది. ఈమె చేసిన పనికి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. రైలు పట్టాల నుంచి దూరంగా వెళ్లాలని వారంతా అరుపులు, కేకలు పెడుతున్నా ఆమె మాత్రం పట్టించుకోలేదు.

Viral Video: స్నేహమంటే ఇదేరా.. ఇద్దరూ కలిసి సైకిల్ ఎలా తొక్కుతున్నారో చూస్తే..


పట్టాలపై మహిళ నిలబడి ఉండడాన్ని గమనించిన రైలు డ్రైవర్.. పదే పదే హారన్ కొడుతూ హెచ్చరించాడు. అయినా ఆమె మాత్రం కొంచెం కూడా భయపడకుండా (Woman walking on train tracks) రైలు పట్టాలపై నడుస్తూ ఉంది. దీంతో చివరకు రైలు ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రయాణికులంతా రైలు నుంచి దిగి పరుగులు పెడుతూ అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Viral Video: పక్కా స్కెచ్ అంటే ఇదే.. ఒడ్డున ఉన్న కుక్కపై మొసలి టార్గెట్.. ఇంతలో వెనుక నుంచి..


సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకే ఇలా చేసినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. దీంతో ఈమె నిర్వాకంపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘వ్యూస్ కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం సరికాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 800కి పైగా లైక్‌లు, 5.59 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఏనుగును రెచ్చగొడితే ఎలా ఉంటుందో తెలుసా.. ఈ పర్యాటకులను ఏం చేసిందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 17 , 2024 | 01:54 PM