Share News

Viral Video: దుకాణంలో కొనేదంతా బంగారం కాదా..! చిన్న టెక్నిక్‌తో ఎలా పట్టేశాడో చూడండి..

ABN , Publish Date - Dec 17 , 2024 | 09:16 AM

బంగారం అంటే ఇష్టపడని మనిషి ఉండడంటే అతిశయోక్తి కాదు. సామాన్యులు మొదలుకొని, ధనవంతుల వరకూ అమితంగా ఇష్టపడే వాటిలో బంగారం ముందు వరుసలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ బంగారాన్ని స్టేటస్‌కి సింబల్‌గా భావిస్తుంటారు. అందులో ధర పెరుగుతున్నా లెక్కచేయకుండా ఎడాపెడా కొనేస్తుంటారు. అయితే..

Viral Video: దుకాణంలో కొనేదంతా బంగారం కాదా..! చిన్న టెక్నిక్‌తో ఎలా పట్టేశాడో చూడండి..

బంగారం అంటే ఇష్టపడని మనిషి ఉండడంటే అతిశయోక్తి కాదు. సామాన్యులు మొదలుకొని, ధనవంతుల వరకూ అమితంగా ఇష్టపడే వాటిలో బంగారం ముందు వరుసలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ బంగారాన్ని స్టేటస్‌కి సింబల్‌గా భావిస్తుంటారు. అందులో ధర పెరుగుతున్నా లెక్కచేయకుండా ఎడాపెడా కొనేస్తుంటారు. అయితే ఈ డిమాండ్‌ను కొందరు క్యాష్ చేసుకుంటుంటారు. దుకాణంలో కొన్నా, నగలపై హాల్‌మార్క్ ముంద్రించి ఉన్నా కూడా అసలు బంగారు అని చెప్పలేని పరిస్థితి నెలకొంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. ఓ వ్యక్తి బంగారు ఆభరణాన్ని చిన్న టెక్నిక్‌‌తో ఎలా తేల్చేశాడో చూస్తే షాకవుతారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బంగారు వస్తువును (gold test) పరీక్షిస్తుంటాడు. అది చూసేందుకు ఒరిజినల్ బంగారం లాగే ఉంటుంది. దానిపై హాల్‌మార్క్ కూడా (Hallmark on gold jewelry) ముద్రించి ఉంటారు. అయినా దాన్ని పరీక్షించాలని నిర్ణయించుకుంటాడు. ముందుగా దాని తీసుకుని ఓ రాయిపై రద్దుతాడు. ఆ తర్వాత దానిపై జెల్ వంటి పదార్థాన్ని పోస్తాడు.

Viral Video: ఈ పోలీసు అతి తెలివి మామూలుగా లేదుగా.. చలికి తట్టుకోలేక ఖైదీతో..


ఇలా చివరకు ఆ బంగారు వస్తువు నకిలీదిగా (Fake gold) తేల్చేస్తాడు. అసలు బంగారు ఎంత రద్దినా రంగు పోదని ఆ వ్యక్తి తెలిపాడు. ఇత్తడి వస్తువులపై బంగారు పూత పూసి ఇలా మోసం చేస్తారని వివరించాడు. చాలా మంది 5% మేకింగ్ చార్జీలు అనగానే ముందూ, వెనుకూ చూడకుండా కొనేస్తుంటారని.. అలా చేయడం వల్ల ఇలా మోసాలు జరిగే అవకాశం ఉందని చెప్పాడు. గుర్తింపు పొందిన దుకాణాల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని సూచించాడు.

Viral Video: సింహాన్ని చుట్టేసిన కొండచిలువ.. చివరికి ఏమైందో చూస్తే కళ్లు తేలేస్తారు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఎంత మోసం.. చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘బంగారు కొనేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18వేలకు పైగా లైక్‌లు, 1.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ డస్ట్ బిన్‌ను చూస్తే చెత్త వేయకుండా ఉండలేరు.. దీన్నెలా తయారు చేశారో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 17 , 2024 | 11:08 AM