Share News

Viral Video: నీటిలో హిప్పో పవర్ ఎలా ఉంటుందో తెలుసా.. సింహం కంటపడడంతో ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Aug 31 , 2024 | 09:36 PM

‘‘స్థాన బలం లేకపోతే మీ స్థలం కూడా శ్మశానమే’’.. అన్న సమెత చందంగా కొన్ని కొన్ని జంతువులు వాటి స్థానాల్లో ఎంతో శక్తిని కలిగి ఉంటాయి. మొసలికి బయట ఉంటే ఎంత బలహీనంగా ఉంటుందో.. నీటిలోకి వెళ్లగానే అంత శక్తివంతంగా మారుతుంది. అలాగే..

Viral Video: నీటిలో హిప్పో పవర్ ఎలా ఉంటుందో తెలుసా.. సింహం కంటపడడంతో ఏం చేసిందో చూడండి..

‘‘స్థాన బలం లేకపోతే మీ స్థలం కూడా శ్మశానమే’’.. అన్న సమెత చందంగా కొన్ని కొన్ని జంతువులు వాటి స్థానాల్లో ఎంతో శక్తిని కలిగి ఉంటాయి. మొసలికి బయట ఉంటే ఎంత బలహీనంగా ఉంటుందో.. నీటిలోకి వెళ్లగానే అంత శక్తివంతంగా మారుతుంది. అలాగే కోతులు కూడా నేల మీద కంటే చెట్ల మీద అమితమైన శక్తిని ప్రదర్శిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషళ్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ హిప్పో వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నీటిలో ఉన్న హిప్పోకు సింహం కనిపించడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జాంబియాలోని (Zambia) లుయాంగ్వా నదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ భారీ హిప్పోపొటామస్ (Hippopotamus) నీటిలో ఈదుతుండగా.. దానికి దూరంగా ఓ సింహం (lion) కనిపిస్తుంది. దీంతో హిప్పోకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంటుంది. ఎలాగైనా సింహానికి చుక్కలు చూపించాలి.. అని అనుకుని వేగంగా దాని సమీపానికి వస్తుంది.

Viral Video: రోడ్డుపై ఠీవీగా నడుస్తున్న సింహం.. రెండు వైపులా మోహరించిన జనాలు.. చివరకు..


అయితే హిప్పో రావడాన్ని గమనించిన సింహం.. ప్రాణాలను అరికాళ్లలో పెట్టుకుని వేగంగా ఈదుతుంది. దాన్నుంచి ఎంత తప్పించుకోవాలని ఎంతో వేగంగా ఈదుతుంది. అయినా హిప్పో సింహం సమీపానికి వచ్చి ఒక్క తోపు తోస్తుంది. దీంతో సింహానికి చుక్కలు కనిపిస్తాయి. దెబ్బకు సింహం తన శక్తినంతా కూడగట్టుకుని మరింత వేగంగా ఈదుతుంది. ఇలా ఆ రెండింటి మధ్య చాలా సేపు పోటాపోటీ నెలకొంటుంది.

Viral Video: పిచ్చి పీక్స్‌కు వెళ్లడమంటే ఇదే.. ఈ యువతి అత్యుత్సాహంతో చివరకు ఏమైందంటే..


అయితే చివరకు సింహం ఎలాగోలా హిప్పోను దాటుకుని ఒడ్డుకు చేరుకుంటుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వివిధ వేదికల్లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహానికి చుక్కలు చూపిచిన హిప్పో’’.. అంటూ కొందరు, ‘‘స్థాన బలం అంటే ఇదేనేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: పర్‌ఫెక్ట్ ఫోకస్ అంటే ఏంటో ఈ జింకను చూసి నేర్చుకోవాల్సిందే.. నీళ్లు తాగుతూ అది చేసిన పని చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 31 , 2024 | 09:38 PM