Amarnath Yatra: ఒక్కరోజులోనే హైదరాబాద్ టూ అమర్‌నాథ్ యాత్ర.. ఖర్చు, జర్నీ విశేషాలివే..
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:12 PM
శ్రీనగర్(srinagar)లోని అమర్ నాథ్ యాత్ర(Amarnath Yatra)కు ప్రతి ఏటా అనేక మంది భక్తులు తరలివెళ్తుంటారు. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకుంటే భక్తులకు పాపాలు తొలిగిపోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే హైదరాబాద్(Hyderabad) నుంచి ఈ యాత్రకు ఒక్కరోజులోనే ఎలా వెళ్లవచ్చనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీనగర్(srinagar)లోని అమర్ నాథ్ యాత్ర(Amarnath Yatra)కు ప్రతి ఏటా అనేక మంది భక్తులు తరలివెళ్తుంటారు. అయితే ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకుంటే భక్తులకు పాపాలు తొలిగిపోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే 23 పుణ్య క్షేత్రాలు దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. దీంతోపాటు కాశీ శివలింగాన్ని దర్శించుకున్న దానికంటే 10 రెట్లు, ప్రయాగ కంటే 100 రెట్ల పుణ్యం లభిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 19 వరకు కొనసాగనున్న ఈ యాత్రకు వెళ్లేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే హైదరాబాద్(Hyderabad) నుంచి ఈ యాత్రకు ఒక్కరోజులోనే ఎలా వెళ్లవచ్చనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్చు ఎంత
అయితే ఈ టూర్ కోసం ఒక్కరోజులో వెళ్లాలంటే విమాన ప్రయాణం(flight journey) బెస్ట్ అని చెప్పవచ్చు. కానీ ఈ ప్రాంతానికి హైదరాబాద్ నుంచి డైరెక్టుగా ఫ్లైట్స్ లేవు. ముందుగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ(delhi)కి చేరుకుని, అక్కడి నుంచి మళ్లీ శ్రీనగర్ వెళ్లాల్సి ఉంటుంది. అంటే రెండు ఫ్లైట్స్ మారాలి. ఆ తర్వాత శ్రీనగర్ నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రాంతానికి వెళ్లేందుకు ఇతర వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం దాదాపు ఒక్కరికి రూ. 60 వేలకుపైగా ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి అమర్ నాథ్ వెళ్లేందుకు దాదాపు నాలుగున్నర గంటల సమయం పడుతుంది. ఇందుకోసం మీరు మీ సమయాన్ని బట్టి అందుబాటులో ఉన్న ఫ్లైట్స్‌లలో ప్రయాణించవచ్చు.
హెలికాప్టర్ కూడా..
అంతేకాదు మీరు ఢిల్లీ(delhi) చేరిన తర్వాత అమర్‌నాథ్ యాత్రకు హెలికాప్టర్ సేవలు(helicopter services) కూడా అందుబాటులో ఉన్నాయి. కావాలంటే వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు. అందుకోసం ఇద్దరికి రూ.15 వేల నుంచి 18 వేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఢిల్లీ నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్యాకేజీతోపాటు ఇతర లాజిస్టికల్ ఏర్పాట్లు కూడా ఉంటాయి. బేస్ క్యాంప్‌ల సమీపంలో మీకు సౌకర్యవంతమైన హోటళ్లు లేదా వసతి వంటి సౌకర్యాలు అందిస్తారు. అయితే మీ ప్లాన్‌ను బట్టి ఖర్చు ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ ఫొటోలోని అమ్మాయిలో ఏదో తేడా ఉంది.. 8 సెకెన్లలో కనిపెడితే మీ పరిశీలనా శక్తి గొప్పదే!
Viral Video: ఈ వధూవరుల డ్యాన్స్ చూస్తే ముచ్చటేయడం ఖాయం.. సిగ్గుపడుతూనే ఎలా చిందులేశారో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..