Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. క్షణాల్లో 3 లక్షల కోట్లు కోల్పోయిన మదుపర్లు!
ABN , Publish Date - Jul 05 , 2024 | 10:50 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) శుక్రవారం (జులై 5న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex), నిఫ్టీ(nifty) సూచీలతోపాటు బ్యాంక్ నిఫ్టీ కూడా ఒత్తిడిలో కనిపించింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఉదయం 10.40 నిమిషాల నాటికి 319 పాయింట్లు పడిపోయి 79,731 పరిధిలో ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) శుక్రవారం (జులై 5న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex), నిఫ్టీ(nifty) సూచీలతోపాటు బ్యాంక్ నిఫ్టీ కూడా ఒత్తిడిలో కనిపించింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఉదయం 10.40 నిమిషాల నాటికి 319 పాయింట్లు పడిపోయి 79,731 పరిధిలో ఉంది. మరోవైపు నిఫ్టీ 63 పాయింట్లు పతనమై 24,239 స్థాయిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 593 పాయింట్లు పతనమై 52,511 పరిధిలో ఉంది. ఐటీ, ఫార్మా షేర్లలో పెరుగుదల కనిపించినా బ్యాంకింగ్ షేర్లలో మాత్రం తీవ్ర ఒత్తిడి నెలకొంది. ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ ఏకంగా 3% కంటే ఎక్కువ నష్టాన్ని చవిచూసింది.
ఈ క్రమంలో HDFC బ్యాంక్, M&M, టైటాన్ కంపెనీ, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, దివిస్ ల్యాబ్స్, ONGC, సిప్లా, లార్సెన్, రిలయన్స్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రారంభ ట్రేడింగ్‌లో సిప్లా, హిందాల్కో, బజాజ్, దివీస్ ల్యాబ్స్ పురోగమించగా, టీసీఎస్, టైటాన్, టాటా స్టీల్ క్షీణించాయి. ఈ క్రమంలో మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం పెరిగింది.
రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఆటో నష్టాలను చవిచూడగా, నిఫ్టీ హెల్త్‌కేర్, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ లాభపడ్డాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు దాదాపు 3 లక్షల కోట్లకుపైగా నష్టపోయినట్లు తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్ నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ ఈరోజు నష్టాల్లో కొనసాగుతోంది. మరోవైపు ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. ఆస్ట్రేలియా S&P/ASX 200 ఇండెక్స్ 0.04 శాతం స్వల్ప క్షీణతను చూసింది. జూలై 4న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికాలో గురువారం మార్కెట్లు మూతపడ్డాయి.
ఇది కూడా చదవండి:
Virat Kohli: ముంబైలో సెలబ్రేషన్స్ పూర్తైన వెంటనే రాత్రికి రాత్రే లండన్ బయలుదేరిన కోహ్లీ
మార్కెట్ దూసుకెళ్తోంది.. జర జాగ్రత్త!
For Latest News and Business News click here