Share News

Viral Video: బర్గర్ తింటుండగా మహిళకు ఊహించని షాక్.. ఉన్నట్టుండి వెనుక నుంచి..

ABN , Publish Date - Aug 17 , 2024 | 04:13 PM

కొన్నిసార్లు ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ ఉండడంతో ఇలాంటి ఊహించని దృశ్యాలు కూడా వీడియోల రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్ని ..

Viral Video: బర్గర్ తింటుండగా మహిళకు ఊహించని షాక్.. ఉన్నట్టుండి వెనుక నుంచి..

కొన్నిసార్లు ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ ఉండడంతో ఇలాంటి ఊహించని దృశ్యాలు కూడా వీడియోల రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్ని వీడియోలు షాక్ అయ్యే విధంగా ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ బర్గర్ తింటుండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పార్కులో చాలా మంది సందర్శకులు చెట్టు కింద అరుగుపై కూర్చుని సేదతీరుతుంటారు. వారిలో కొందరు ఆహారం తింటుండగా.. మరికొందరు ఫోన్లు చూసుకుంటుంటారు. ఈ సమయంలో ఓ మహిళ చేతిలో బర్గర్‌‌తో అక్కడికి వస్తుంది. వారి మధ్యలో అరుగుపై కూర్చుని బర్గర్ తినాలని చూస్తుంది.

Viral Video: ఒకే కొమ్మపై డేగ, రాబందు.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. షాకవ్వాల్సిందే..


అయితే తీరా బర్గర్ తింటుండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. వెనుక ఉన్న ఇగువానా అనే పెద్ద సైజు తొండ.. ఆమెను గమనిస్తూ ఉంటుంది. బర్గర్ చూడగానే ఒక్కసారిగా ఆమె దగ్గరికి వెళ్తుంది. మెల్లగా దగ్గరికి వెళ్లి వెనుక నుంచి భుజంపైకి దూకుతుంది. దీంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి చూస్తుంది. ఇగువానాను చూసి షాక్ అవుతుంది. ఆమె పైకి దూకిన ఇగువానా (Iguana grabbing burger from woman hand) బర్గర్‌ తినేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది.

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..


ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. కొందరు భయంతో దూరంగా వెళ్లిపోతారు. మరికొందరు ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇంకొందరేమో.. దూరం నుంచి వీడియోలు తీసుకుంటూ ఉంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ తొండకు బాగా ఆకలేసినట్టుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

Updated Date - Aug 17 , 2024 | 04:13 PM