Share News

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

ABN , Publish Date - Aug 16 , 2024 | 07:33 PM

రైళ్లలో రకరకాల వ్యాపారాలు చేసుకునే వాళ్లను చూస్తుంటాం. టీలు అమ్ముతూ కొందరు, ఆహార ప్యాకెట్లను విక్రయిస్తూ మరికొందరు, వివిధ రకాల స్నాక్స్‌ను విక్రయిస్తూ ఇంకొందరు వ్యాపారం చేయడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వీడియోలు కూడా...

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

రైళ్లలో రకరకాల వ్యాపారాలు చేసుకునే వాళ్లను చూస్తుంటాం. టీలు అమ్ముతూ కొందరు, ఆహార ప్యాకెట్లను విక్రయిస్తూ మరికొందరు, వివిధ రకాల స్నాక్స్‌ను విక్రయిస్తూ ఇంకొందరు వ్యాపారం చేయడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వీడియోలు కూడా నిత్యం నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఓ మహిళ రైల్లో చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ వ్యాపారం మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) బంగావ్ లోకల్ ట్రైన్‌లో (Local train) ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్లో ఓ మహిళ (woman) చేసిన పని చూసి అంతా షాక్ అయ్యారు. బోగీల్లో యవతులకు వద్దకు వెళ్లిన ఆమె.. వారిని ఒప్పించిహైబ్రోస్‌కు థ్రెడింగ్ (highbrows Threading) తక్కువ చేసిపెడుతోంది. దీంతో ఆమె వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలు అన్న చందంగా తయారైంది.

Viral Video: అడుగు పెట్టగానే కుంగిపోయిన నేల.. లోపల తొంగిచూడగా దిమ్మతిరిగే సీన్..


ఆమె వద్ద కనుబొమ్మలు థ్రెడింగ్ చేయించుకోవడం కోసం యువతులు మొత్తం క్యూకట్టారు. దీంతో ఆమె వారిని కూర్చోబట్టి వరసగా థ్రెడ్ వేయడం స్టార్ట్ చేసింది. ఆమెను చూస్తే చదువుకున్నట్లు అనిపించకపోయినా.. నోటిలో దారాన్ని పట్టుకుని రెండు చేతులతో యువతులకు థ్రెండ్ వేయడాన్ని ఎంతో చాకచక్యంగా చేస్తోంది. ఎంతో అనుభవం ఉన్న వారిలా ఆమె చేసిన ఈ పని చూసి అంతా అవాక్కయ్యారు. అలాగే ఆమె థ్రెడ్ చేసే సమయంలో బోగీ గేటు వద్ద ప్రమాదకరంగా నిలబడి చేయడం చూసి మరికొందరు షాక్ అయ్యారు.

Viral Video: అవి కారు లైట్లా లేక క్యారీ బ్యాగులా.. అనుమానం వచ్చి తొలగించగా..


కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఒకరు కనుబొమ్మలను ఫణంగా పెడితే.. మరొకరు ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారు’’.. అంటూ కొందరు, ‘‘ఆధునిక బ్యూటీషియన్లతో పోలీస్తే.. ఈమె చాలా బాగా చేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: దాడి నుంచి తప్పించుకోవాడానికి అడవిదున్న మాస్టర్ ప్లాన్.. దాని స్కెచ్ చూసి ఖంగుతిన్న హైనా.. చివరకు..

Updated Date - Aug 16 , 2024 | 07:33 PM