Viral Video: గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు.. చిన్న టెక్నిక్ తెలీక వీళ్లు పడ్డ తిప్పలు చూస్తే..
ABN , Publish Date - Mar 01 , 2024 | 09:30 PM
కొన్నిసార్లు చిన్న చిన్న తప్పుల వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాగే మరికొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు సైతం చిన్న చిన్న టెక్నిక్‌లతో తప్పిపోతుంటాయి. చాలా మంది ఈ విషయం తెలీక అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
కొన్నిసార్లు చిన్న చిన్న తప్పుల వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాగే మరికొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు సైతం చిన్న చిన్న టెక్నిక్‌లతో తప్పిపోతుంటాయి. చాలా మంది ఈ విషయం తెలీక అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు ముగ్గురు యువకులు శతవిధాలా ప్రయత్నించారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గ్యాస్ సిలిండర్‌ను సైకిల్‌పై పెట్టుకుని ఇంటికి తీసుకెళ్తుంటాడు. అయితే మార్గ మధ్యలో సిలిండర్ నుంచి ఉన్నట్టుండి (Fire came out of the cylinder) మంటలు బయటకు వస్తాయి. దీంతో భయపడిపోయిన వ్యక్తి సైకిల్ కింద పడేసి దూరంగా పారిపోతాడు. తర్వాత ధైర్యం తెచ్చుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తాడు. అయినా అతడి వల్ల సాధ్యం కాదు. అంతలో అక్కడే ఉన్న ఇద్దరు యువకులు కూడా అక్కడికి వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వారు సిలిండర్‌పై నీళ్లు పోస్తారు. అయినా మంటలు ఆరిపోవు.
చివరకు సిలిండర్‌ను నీటిలో ముంచినా కూడా ప్రయోజనం ఉండదు. దీంతో మంటలు ఎలా ఆర్పాలో తెలీక వారు ముగ్గురూ తలలు పట్టుకుంటారు. ఈ క్రమంలో చివరకు ఓ వ్యక్తి గోనె సంచి పట్టుకుని అక్కడికి వస్తాడు. అందరినీ పక్కకు తప్పుకోమని చెప్పి.. కింద పడి ఉన్న సిలిండర్‌ను పైకి నిలబెడతాడు. తర్వాత మంటపై గోనె సంచి కప్పేయగానే.. టక్కున మంటలు ఆరిపోతాయి. అతడి టెక్నిక్ చూసి మిగతా ముగ్గురు యువకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి టెక్నిక్‌ను అంతా తెలుసుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘మంటలు ఎలా ఆర్పాలా చాలా బాగా వివరించారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.