Viral Video: పర్వతం పైకి బల్లిలా పాకుతూ వెళ్లాడు.. మధ్యలో ఏం జరిగిందో చూస్తే.. షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Dec 07 , 2024 | 06:28 PM
కొందరు మిగతా వారి కంటే భిన్నంగా ప్రవర్తిస్తుంటారు.. అలాగే ఇంకొందరు చేసే పనులు చూస్తే.. వీళ్లకేమైనా మానవాతీత శక్తులలేమైనా ఉన్నాయా... అని అనిపిస్తుంటుంది. ఇలాంటి వినూత్నమైన టాలెంట్ ఉన్న వారికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. అయితే..
కొందరు మిగతా వారి కంటే భిన్నంగా ప్రవర్తిస్తుంటారు.. అలాగే ఇంకొందరు చేసే పనులు చూస్తే.. వీళ్లకేమైనా మానవాతీత శక్తులలేమైనా ఉన్నాయా... అని అనిపిస్తుంటుంది. ఇలాంటి వినూత్నమైన టాలెంట్ ఉన్న వారికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ఇలాంటి వినూత్న విన్యాసాలు చేసే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు కూడా జరుగుతుంటాయి. అలాంటి వీడియోలను కూడా నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పర్వతం పైకి బల్లిలా పాక్కుంటూ వెళ్లాడు. మధ్యలో ఏం జరిగిన ఘటన చూసి అంతా షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అంతా చూస్తుండగా ఓ వ్యక్తి పెద్ద పర్వతం పైకి బల్లిలా (man climbing mountain like lizard) పాక్కుంటూ వెళ్లే సాహసానికి పూనుకున్నాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఒట్టి చేతులతో పైకి ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. పర్వతం ఎక్కే సమయంలో చేతులకు తెల్లటి పౌడర్ పూసుకుని, రాళ్ల మధ్యలోని చిన్న చిన్న సందుల్లో చేతులు పెట్టి పైకి ఎక్కడం స్టార్ట్ చేశాడు.
Viral Video: వామ్మో.. ఇదేంట్రా బాబోయ్.. నడి రోడ్డుపై కింగ్ కోబ్రాతో ఫన్నీ గేమ్స్..
ఏటవాలుగా ఉన్న అంత పెద్ద పర్వతాన్ని కూడా ఎంతో సులభంగా ఎక్కడం చూసి కింద ఉన్న వారంతా షాక్ అయ్యారు. ఇలా చాలా పైకి ఎక్కిన తర్వాత మధ్యలో ఉన్నట్టుండి పట్టు తప్పి ఒక్కసారిగా కిందపడిపోతాడు. అయితే కింద మొత్తం నీళ్లు ఉండడంతో అతడికి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. పైనుంచి జారిపడిన ఆ వ్యక్తి నేరుగా ధబేల్‌మని (man fell from the top of the mountain) నీళ్లలో పడిపోయాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Viral: ఛీ.. ఇలాకూడా స్నానం చేస్తారా.. ఈ బాత్రూం కట్టినోడు కనపడితే వెంటపడి కొడతారు..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, ‘‘ఎంతో బాగా ట్రై చేశారు.. ఇలాంటి టాలెంట్ కొందరికే సాధ్యం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3,800కి పైగా లైక్‌లు, 3.92 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇంటి సీలింగ్‌లో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా.. బద్దలు కొట్టి చూడగా చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..