Share News

Viral Video: బంగ్లాదేశ్‌లో ఇలాక్కూడా జరుగుతుందా.. రైలింజన్‌పై వీళ్లు చేస్తున్న నిర్వాకం చూడండి..

ABN , Publish Date - Aug 01 , 2024 | 10:21 AM

రైలు ప్రయాణాల్లో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరు రన్నింగ్ ట్రైన్లను ఎక్కడం, దిగడంతో పాటూ ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతుంటారు. అయినా చాలా మందిలో ..

Viral Video: బంగ్లాదేశ్‌లో ఇలాక్కూడా జరుగుతుందా.. రైలింజన్‌పై వీళ్లు చేస్తున్న నిర్వాకం చూడండి..

రైలు ప్రయాణాల్లో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరు రన్నింగ్ ట్రైన్లను ఎక్కడం, దిగడంతో పాటూ ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతుంటారు. అయినా చాలా మందిలో ఏమాత్రం మార్పు రాదు. పైగా మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అందరికీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొందరు రైలింజన్‌పై నిలబడి వెళ్తున్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘బంగ్లాదేశ్‌లో ఇలాక్కూడా జరుగుతుందా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో (Bangladesh) చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా మన ప్రాంతాల్లో రైలు ప్రయాణాల్లో ఫుట్‌బోర్డు ప్రయాణం ఎక్కువగా చూస్తుంటాం. అప్పుడప్పుడూ కొందరు బాత్రూముల్లో ఇరుక్కుని మరీ ప్రయాణం చేయడం కూడా చూస్తుంటాం. అయితే బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇందుకు పూర్తి విరద్ధంగా ఉంది.

Viral Video: నిద్రపోతున్న మహిళ జుట్టులోకి దూరిన పాము.. చివరకు..


కొందరు యువకులు రైలు ప్రయాణంలో చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. రైలు బోగీలో ఉండాల్సిన వారు.. ఏకంగా రైలింజన్ ముందువైపు కనిపించారు. ఇంజిన్‌కు ముందు వరుసగా నిలబడ్డ (Youth traveling standing on the train engine) వారు ఈలలు వేస్తూ గోల చేస్తూ, వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నారు. వీరు మాత్రమే కాకుండా వీరితో పాటూ ఓ చిన్న పిల్లాడిని కూడా అక్కడే నిలబెట్టారు.

Viral Video: విద్యుత్ స్టవ్‌పై వంట చేయాలని వెళ్లగా వింత శబ్ధాలు.. ఏంటా అని పక్కకు తొలగించి చూడగా.. ఒక్కసారిగా..


ఇలా చాలా దూరం వరకూ వారు రైలు ఇంజిన్‌కు ముందు వైపు నిలబడి వెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఓరేయ్.. అది రైలు అనుకున్నా లేక ఎద్దుల బండి అనుకున్నారా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రయాణం చేయడం చాలా ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎద్దును చూసి కారు దిగి కర్ర పట్టుకున్న వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. షాకవ్వాల్సిందే..

Updated Date - Aug 02 , 2024 | 06:25 PM