Share News

Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌లపై ఇలాక్కూడా జరగొచ్చు.. ప్రయాణికుల మధ్యలో పడుకున్న వ్యక్తి.. చివరకు..

ABN , Publish Date - Aug 01 , 2024 | 10:48 AM

దొంగలు రోజురోజుకూ తెలివిమీరిపోతున్నారు. కొందరు నగలు, నగదు దోచుకునేందుకు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. పోలీసులకు దొరక్కుండా వారు వేసే ప్లాన్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొందరు..

Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌లపై ఇలాక్కూడా జరగొచ్చు.. ప్రయాణికుల మధ్యలో పడుకున్న వ్యక్తి.. చివరకు..

దొంగలు రోజురోజుకూ తెలివిమీరిపోతున్నారు. కొందరు నగలు, నగదు దోచుకునేందుకు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. పోలీసులకు దొరక్కుండా వారు వేసే ప్లాన్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొందరు నేరస్థులు పిల్లలను కిడ్నాప్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరిస్తుంటారు. ఎంతో అప్రమత్తంగా ఉంటే తప్ప ఇలాంటి వారిని పసిగట్టలేని పరిస్థితి. తాజాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికుల మధ్యలో పడుకుని చివరకు ఏం చేశాడో చూడండి..


ఢిల్లీ పోలీసు (Delhi Police) షేర్ చేసిన ఓ వీడియో (Viral Video) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై (Railway platform) చాలా మంది ప్రయాణికులు పడుకుని ఉంటారు. ఇంతలో ముఖానికి మాస్క్ ధరించిన ఓ యువకుడు అటుగా వస్తాడు. చుట్టూ అందరినీ గమనించి చివరకు ప్రయాణికుల మధ్యలో పడుకుంటాడు. కాసేపు పడుకున్నట్లు నటించి.. ఆ తర్వాత ఆ పక్కనే నిద్రపోతున్న పిల్లాడిని ఎత్తుకుని (thief kidnapped a child) అక్కడి నుంచి చల్లగా జారుకుంటాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: ఎద్దును చూసి కారు దిగి కర్ర పట్టుకున్న వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. షాకవ్వాల్సిందే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తల్లిదండ్రులు లేని ఆ పిల్లాడి పరిస్థితి ఏంటో పాపం.. వీళ్లకు కొంచెం కూడా కనికరం లేదే’’.. అంటూ కొందరు, ‘‘ఈ సంఘటన జరిగిన ప్రాంతం UP పోలీసుల పరిధిలోకి వస్తుంది.. దయచేసి వెంటనే చర్యలు తీసుకోండి’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి వారికి ఉరిశిక్ష వేస్తే తప్ప ఈ నేరాలు ఆగవు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: విద్యుత్ స్టవ్‌పై వంట చేయాలని వెళ్లగా వింత శబ్ధాలు.. ఏంటా అని పక్కకు తొలగించి చూడగా.. ఒక్కసారిగా..

Updated Date - Aug 01 , 2024 | 10:48 AM