Share News

Viral Video: పామును పేపర్లలో చుట్టేసి నిప్పు పెట్టిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Aug 01 , 2024 | 11:15 AM

పాములు చూడగానే చాలా మంది భయంతో పారిపోవడం సర్వసాధారణం. అయితే కొందరు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు పట్టుకోవడమే కాకుండా మెడలో వేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చేస్తుంటారు. ఇంకొందరేమో..

Viral Video: పామును పేపర్లలో చుట్టేసి నిప్పు పెట్టిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూడండి..

పాములు చూడగానే చాలా మంది భయంతో పారిపోవడం సర్వసాధారణం. అయితే కొందరు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు పట్టుకోవడమే కాకుండా మెడలో వేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చేస్తుంటారు. ఇంకొందరేమో.. వాటి పట్ల క్రూరంగా ప్రవరిస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బతికున్న పామును పేపర్లలో చుట్టేసి నిప్పంటించారు. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఓ పామును పట్టుకుని రోడ్డుపైకి తీసుకొచ్చాడు. అక్కడ చాలా పేపర్ల మధ్యలో దాన్ని సజీవంగా చుట్టేశాడు. తర్వాత వాటికి (man set fire to living snake) నిప్పంటించడంతో మంటలు చెలరేగాయి. దీంతో పాము నొప్పిని తాళలేక అక్కడి నంచి పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే ఆ వ్యక్తం దాన్ని ఎలాగైనా చంపేందుకు ప్రయత్నించాడు.

Viral Video: ఎద్దును చూసి కారు దిగి కర్ర పట్టుకున్న వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. షాకవ్వాల్సిందే..


ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటనల చోటు చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న స్నేక్ రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని అతన్ని వారించింది. చివరకు పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. కాగా, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో ఇలాంటి అనేకం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. అలాగే ఆ వ్యక్తి పాముకు మంట పెడుతున్న సమయంలో శ్రీరాముడి పేరు ఉచ్చరించడంపై హిందువులు మండిపడుతున్నారు.

Viral Video: విద్యుత్ స్టవ్‌పై వంట చేయాలని వెళ్లగా వింత శబ్ధాలు.. ఏంటా అని పక్కకు తొలగించి చూడగా.. ఒక్కసారిగా..


జంతువులను హింసిస్తూ.. దేవుడి పేరు ఉచ్చరిస్తావా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మూగజీవాలను హింసించడం నేరమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మూగ జీవాలను హింసించడం నేరం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ఘటనలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: నిద్రపోతున్న మహిళ జుట్టులోకి దూరిన పాము.. చివరకు..

Updated Date - Aug 01 , 2024 | 11:15 AM