Share News

Viral Video: కుక్కల నుంచి తప్పించుకునే క్రమంలో.. చివరకు ఇతడు చేసిన నిర్వాకం..

ABN , Publish Date - Sep 08 , 2024 | 03:26 PM

వీధుల్లో కుక్కలు స్పైర విహారం చేసి పిల్లల నుంచి పెద్దల వరకూ అందరిపై దాడి చేస్తుంటాయి. ఈ క్రమంలో కొందరు పిల్లలు ప్రాణాలు కోల్పోయిన విషాధకర ఘటనలను కూడా చూస్తున్నాం. దీంతో ఎక్కడైనా కుక్కలు కనిపిస్తేనే భయంతో పారిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిదంటే..

Viral Video: కుక్కల నుంచి తప్పించుకునే క్రమంలో.. చివరకు ఇతడు చేసిన నిర్వాకం..

వీధుల్లో కుక్కలు స్పైర విహారం చేసి పిల్లల నుంచి పెద్దల వరకూ అందరిపై దాడి చేస్తుంటాయి. ఈ క్రమంలో కొందరు పిల్లలు ప్రాణాలు కోల్పోయిన విషాధకర ఘటనలను కూడా చూస్తున్నాం. దీంతో ఎక్కడైనా కుక్కలు కనిపిస్తేనే భయంతో పారిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిదంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ బాలుడు రోడ్డుపైకి వెళ్లగానే కుక్కలు అతన్ని వెంటపడ్డాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి అతను చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) గ్రేటర్ నోయిడాలోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న అనికేత్ జైస్వాల్ అనే బాలుడు ఆదివారం ఫుట్‌బాల్ ఆడేందుకు ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఎంట్రెన్స్‌‌లో ఉన్న అద్దాల డోరును తీసుకుని బయటికి వెళ్లిన క్షణాల వ్యవధిలో షాకింగ్ ఘటన చోసుచేసుకుంది.

Viral Video: వామ్మో.. ఏకంగా పడవనే పబ్‌గా మార్చేశారే.. డీజే మ్యూజిక్ పెట్టి వాళ్లు చేస్తున్న నిర్వాకం చూస్తే..


ఆ బాలుడిని వీధి కుక్కలు వెంటపడడంతో (dogs chased the boy) భయంతో పరుగందుకున్నాడు. ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వచ్చే క్రమంలో గ్లాస్ డోరును చేత్తో ఒక్కసారిగా గట్టిగా తోసేశాడు. దీంతో డోరు గోడకు తగులుకుని ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. అతన్ని వెంటపడుతూ వచ్చిన కుక్కలు ఇంట్లోకి రాకుండా నేరుగా వేరే వైపు వెళ్లిపోయాయి. అయినా ఇదేమీ పట్టించుకోకుండా ఆ బాలుడు భయం భయంగా ఇంట్లోకి పరుగులు పెట్టాడు.

Viral Video: స్కూటీ నడపడమే కాదు.. ఎక్కడ బ్రేక్ వేయాలో కూడా తెలియాలి.. ఈ యువతి ఏ చేసిందంటే..


కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. కాస్త ఆలస్యం అయ్యుంటే.. పెద్ద ప్రమాదం జరిగేది’’.. అంటూ కొందరు, ‘‘అద్దం పగిలిపోయినా కుక్కల దాడి నుంచి బయటపడ్డాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గణేశ్ విగ్రహాన్ని ఇలా తీసుకురావడం ఎక్కడైనా చూశారా.. ఇతను చేసిన స్టంట్ చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 08 , 2024 | 03:29 PM