Share News

Viral Video: గణేశ్ విగ్రహాన్ని ఇలా తీసుకురావడం ఎక్కడైనా చూశారా.. ఇతను చేసిన స్టంట్ చూస్తే..

ABN , Publish Date - Sep 08 , 2024 | 02:39 PM

ప్రస్తుతం దేశం మొత్తం గణేశ్ నామస్మరణలో మారుమోగిపోతోంది. వీధి వీధికీ ఓ గణపయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, 11రోజుల పాటుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే కొందరు గణేశ్ విగ్రహాల సెలక్షన్ దగ్గర నుంచి.. వాటిని తీసుకురావడం..

Viral Video: గణేశ్ విగ్రహాన్ని ఇలా తీసుకురావడం ఎక్కడైనా చూశారా.. ఇతను చేసిన స్టంట్ చూస్తే..

ప్రస్తుతం దేశం మొత్తం గణేశ్ నామస్మరణలో మారుమోగిపోతోంది. వీధి వీధికీ ఓ గణపయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, 11రోజుల పాటుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే కొందరు గణేశ్ విగ్రహాల సెలక్షన్ దగ్గర నుంచి.. వాటిని తీసుకురావడం, అలంకరణ, పూజలు చేయడం.. ఇలా అన్ని పనుల్లోనూ తమ ప్రత్యేకత ఉండేలా చూసుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి గణేశ్ విగ్రహాన్ని తీసుకొచ్చే విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం నెట్టింట ఏ వేదికలో చూసినా (Ganesh Puja) గణేశ్ మంటపాల్లో పూజలు, భజనలు, డాన్సులకు సంబందించిన వీడియోలే దర్శనమిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు యువకులు గణేశ్ పూజను వినూత్నంగా చేస్తూ నెటిజన్ల దృష్టిలో పడుతున్నారు.

Viral Video: స్కూటీ నడపడమే కాదు.. ఎక్కడ బ్రేక్ వేయాలో కూడా తెలియాలి.. ఈ యువతి ఏ చేసిందంటే..


తాజాగా ఓ యువకుడు ఇలాంటి వినూత్న ప్రయత్నం చేశాడు. గణేశ్ విగ్రహాన్ని (ganesha idol ) తన భుజాలపై పెట్టుకున్న సదరు వ్యక్తి బైకుపై వచ్చాడు. అందరిరా బైకుపై వచ్చి ఉంటే ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ ఇతడు బైకుపై నిలబడి.. అది కూడా పూర్తిగా వెనుక వైపు నిలబడ్డాడు. ఆపై గణేశ్ విగ్రహాన్ని భుజాలపై పెట్టుకుని రయ్యిన దూసుకెళ్లున్నాడు. కేవలం కాళ్ల సాయంతోనే బైకును కంట్రోల్ చేస్తున్నాడు.

Viral Video: వామ్మో.. ఏకంగా పడవనే పబ్‌గా మార్చేశారే.. డీజే మ్యూజిక్ పెట్టి వాళ్లు చేస్తున్న నిర్వాకం చూస్తే..


రద్దీ రోడ్డుపైనే అతను ఈ విధంగా డేంజరస్ స్టంట్ (Bike stunt) చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రమాదకరం బ్రదర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Optical illusion: వర్షంలో క్యాంపింగ్ కోసం వెళ్తున్న వీరికి.. 20 సెకన్లలో గొడుకు వెతికిపెట్టండి చూద్దాం..


ఇవి కూడా చదవండి..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 08 , 2024 | 02:39 PM