Share News

Viral Video: ఆగిపోయిన కారును ఇలా ఎవరైనా తోస్తారా.. ఈ వ్యక్తి నిర్వాకానికి అవాక్కవుతున్న నెటిజన్లు..

ABN , Publish Date - Sep 12 , 2024 | 08:29 PM

ఉన్నట్టుండి వాహనం ఆగిపోతే ఎవరైనా ముందుకు వచ్చి నెట్టుకుంటూ వెళ్లడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. బైకులు ఆగిపోయిన సందర్భాల్లో మరో బైకులోని వారు కాలితో నెట్టుకుంటూ వెళ్లడం చూస్తుంటాం. అదేవిధంగా ఒక వాహనంతో మరో వాహనాన్ని నెట్టడం కూడా చూస్తుంటాం. అయితే..

Viral Video: ఆగిపోయిన కారును ఇలా ఎవరైనా తోస్తారా.. ఈ వ్యక్తి నిర్వాకానికి అవాక్కవుతున్న నెటిజన్లు..

ఉన్నట్టుండి వాహనం ఆగిపోతే ఎవరైనా ముందుకు వచ్చి నెట్టుకుంటూ వెళ్లడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. బైకులు ఆగిపోయిన సందర్భాల్లో మరో బైకులోని వారు కాలితో నెట్టుకుంటూ వెళ్లడం చూస్తుంటాం. అదేవిధంగా ఒక వాహనంతో మరో వాహనాన్ని నెట్టడం కూడా చూస్తుంటాం. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి కారును తోసే విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఆగిపోయిన కారును ఇలా ఎవరైనా తోస్తారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వర్షపు నీటిలో ఓ కారు సడన్‌గా రోడ్డుపై ఆగిపోయింది. కారును నెట్టడానికి సమీపంలో ఎవరూ లేరు ఇంతలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి కారును నెట్టేందుకు ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా అతను ఇంకాస్త వినూత్నంగా ఆలోచించాడు. కారు వెనుకే ఉన్న ఫైరింజన్‌ను (fire engine) సాయంతో కారును నెట్డడానిక ప్లాన్ చేశాడు.

Viral Video: వేదికపైకి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డ వధువు.. అసలు విషయం గ్రహించిన వరుడు.. చివరకు ఏం చేశాడంటే..


అయితే ఫైరింజన్ నేరుగా కారును నెట్టకుండా మధ్యలో తాను ఎంటర్ అయ్యాడు. ఫైరింజన్‌కు వీపు ఆనించి, తన కాళ్లను కారు వెనుక వైపు పెట్టాడు. ఫైరింజన్ ముందుకు వస్తుండగా తన కాళ్ల (man pushes car with his legs) బలంతో కారును నెట్టేశాడు. ఇలా ఫైరింజన్ సాయంతో విచిత్రంగా కారును నెట్టిన ఇతన్ని చూసి అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు.

Viral Video: మొసలి దంతాలకు లెగ్ పీస్‌తో పరీక్ష.. నోటిలో పెట్టి బలంగా లాగడంతో చివరకు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాకిస్థాన్లో ఇలాంటి విచిత్రాలకు కొదువే ఉండదు’’.. అంటూ కొందరు, ‘‘ఈ వ్యక్తి రోజూ మౌంటైన్ డ్యూ తాగుతున్నాడేమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 86 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: దున్నపోతును వేటాడిన సింహాలు.. తీరా తినే సమయంలో మొదలైన గొడవ.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెళ్లిలో ఫొటోలు తీస్తుండగా షాకింగ్ సీన్.. వధువు తలపై ముద్దు పెట్టమంటే.. వరుడి వింత నిర్వాకం.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 12 , 2024 | 09:22 PM