Share News

Viral Video: వామ్మో.. ఇదేంటీ.. చలి నుంచి తప్పించుకోవాలని మంటపై పడుకున్న వ్యక్తి.. చివరికి జరిగింది చూస్తే..

ABN , Publish Date - Dec 15 , 2024 | 11:35 AM

ప్రస్తుతం చలి విపరీతంగా ఉండడంతో ప్రజలంతా వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు తమ ఇళ్లలో హీటర్లు పెట్టుకుంటుంటే.. మరికొందరు చలి మంటలు వేసుకుని చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. చలి నుంచి తప్పించుకోవడానికి ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంకొందరు ..

Viral Video: వామ్మో.. ఇదేంటీ.. చలి నుంచి తప్పించుకోవాలని మంటపై పడుకున్న వ్యక్తి.. చివరికి జరిగింది చూస్తే..

ప్రస్తుతం చలి విపరీతంగా ఉండడంతో ప్రజలంతా వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు తమ ఇళ్లలో హీటర్లు పెట్టుకుంటుంటే.. మరికొందరు చలి మంటలు వేసుకుని చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. చలి నుంచి తప్పించుకోవడానికి ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంకొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం కూడా చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చలి నుంచి తప్పించుకోవడానికి ఏకంగా మంటపై పడుకున్నాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చలికి తట్టుకోలేక ఇంటి ముందు చలి (cold) మంట వేసుకున్నాడు. పెద్ద పెద్ద చెక్క బాక్సులను పడేసి మంట పెట్టాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే అతను విచిత్ర నిర్వాకానికి పాల్పడ్డాడు. మంటకు దూరంగా కూర్చోవాల్సిన అతను.. అందుకు విరుద్ధంగా ఏకంగా మండుతున్న చెక్క బాక్సుపై పడుకున్నాడు.

Viral Video: పామును టార్గెట్ చేసిన డేగ.. తీరా దాడి చేయబోయే సమయంలో షాకింగ్ ట్విస్ట్.. చివరకు..


కింద మంటలు పెద్దగా మండుతున్నా కూడా (man lying on fire) ఆ వ్యక్తి మాత్రం అలాగే పడుకుని ఉన్నాడు. ఇలా కొద్ది సేపు పడుకున్న అతను.. మంటలు అంటుకునే సమయంలో చాకచక్యంగా కిందకు దిగిపోయాడు. ఇలా చలిమంటపై పడుకుని అంతా అవాక్కయ్యేలా చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: తవ్వకాల్లో బయటపడ్డ మానవ ఎముక.. మోకాలి వద్ద పరిశీలించగా షాకింగ్ సీన్..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘యమరాజుతో మీటింగ్ పెట్టి వెనక్కు వచ్చాడు’’.. అంటూ కొందరు, ‘‘వ్యూస్ కోసం ఇలాంటి ప్రమాదకర పనులు చేయొద్దు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇతను నిజమైన పుష్పలాగా ఉన్నాడే’’.. అంటూ ఇంకొందరు, అలాగే చాలా మంది వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వధువుకు స్వీట్ తినిపించాలని చూసిన వరుడు.. చివరకు ఆమె రియాక్షన్ చూసి అంతా షాక్..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 15 , 2024 | 11:35 AM