Viral Video: పామును టార్గెట్ చేసిన డేగ.. తీరా దాడి చేయబోయే సమయంలో షాకింగ్ ట్విస్ట్.. చివరకు..
ABN , Publish Date - Dec 15 , 2024 | 07:54 AM
గద్దలు, డేగలు, రాబందుల వేంట ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకాశంలో విహరిస్తూ నేలపై ఉండే చిన్న చిన్న జీవులను కూడా పసిగట్టి వేటాడటం చూస్తుంటాం. అలాగే జింక, మేక వంటి జంతువులను సైతం వేటాడిన జంతువలను కూడా చూశాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా..
గద్దలు, డేగలు, రాబందుల వేంట ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకాశంలో విహరిస్తూ నేలపై ఉండే చిన్న చిన్న జీవులను కూడా పసిగట్టి వేటాడటం చూస్తుంటాం. అలాగే జింక, మేక వంటి జంతువులను సైతం వేటాడిన జంతువలను కూడా చూశాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పామును టార్గెట్ చేసిన డేగ.. తీరా చంపేసే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ డేగ ఏదైనా కనిపిస్తే తినేయాలని చూస్తూ ఉంటుంది. ఇంతలో దానికి దూరంగా ఓ పాము కనిపిస్తుంది. దీంతో పామును టార్గెట్ చేసిన డేగ.. నేరుగా వెళ్లి దాని పక్కన వాలుతుంది. కాసేపు పామును గమనించిన డేగ.. తీరా చంపాలని (eagle trying to attack snake) ప్రయత్నించే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.
Viral Video: ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా.. కారు లాంటి ట్రాక్టర్‌ను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తున్న పాము.. ఒక్కసారిగా వెనక్కు తిరిగి డేగపై బుసలు కొడుతూ దాడికి యత్నిస్తుంది. పాము ఎదురుదాడి చేయడంతో (snake scared the eagle) డేగ ఒక్కసారిగా భయపడిపోతుంది. వెంటనే అక్కడి నుంచి ఎగిరిపోయి దూరంగా వాలుతుంది. తర్వాత ఆ పాము డేగ పక్క నుంచే వెళ్లిపోతుంది. అయినా డేగ అలాగే చూస్తుండిపోతుందే తప్ప.. దాడి చేసే ధైర్యం మాత్రం చేయలేదు. చూస్తుండగానే ఆ పాము అక్కడి నుంచి పొదల్లోకి వెళ్లిపోతుంది. దాని వెనుకే వెళ్లిన డేగ అక్కడే నిలబడి పామును గమనిస్తూ ఉండిపోతుంది.
Viral Video: బాత్రూంలో షాకింగ్ సీన్.. గోడ బద్దలు కొట్టి చూడగా.. కళ్లు జిగేల్‌మనే సీన్..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో ఈ పాము పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘డేగ ప్లాన్ వర్కవుట్ కాలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6వేలకు పైగా లైక్‌లు, 2.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వామ్మో.. ఇది నిజమేనా.. సింహాన్ని లాక్కెళ్తున్న డేగ.. షాకవుతున్న నెటిజన్లు..
ఇవి కూడా చదవండి..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..