Share News

Viral Video: ఈగలకు తెలీకుండా తేనె చోరీ.. ఇతడి టెక్నిక్ ఏంటో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Oct 19 , 2024 | 12:03 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తేనె తీసేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా.. అందరిలా ఇతను కూడా తేనెను తీసి ఉండుంటే ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ ఇతను తేనె తీసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు...

Viral Video: ఈగలకు తెలీకుండా తేనె చోరీ.. ఇతడి టెక్నిక్ ఏంటో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొందరు తమ టాలెంట్‌కు పదును పెట్టి వివిధ రకాల విన్యాసాలు చేస్తూ వైరల్ అవుతుంటే.. మరికొందరు చిత్రవిచిత్రమైన ఐడియాలతో ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ నెటిజన్లు దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి సరదా సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి ఈగలకు తెలీకుండా తేనెను చోరీ చేశాడు. ఇతడి టెక్నిక్ ఏంటో తెసుకుని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తేనె తీసేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా.. అందరిలా ఇతను కూడా తేనెను తీసి ఉండుంటే ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ ఇతను తేనె తీసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Optical illusion: ఈ చిత్రంలో గడియారం ఎక్కడుందో 20 సెకన్లలో కనిపెడితే.. మీ కళ్లు బాగున్నట్లే..


తేనె ఉన్న చెట్టు వద్దకు వెళ్లిన ఆ వ్యక్తి .. వాటిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా తేనె తీసేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం తన జేబులో ఉన్న స్ట్రాను బయటికి తీశాడు. ఎలాగైతే గ్లాసులో స్ట్రా వేసి కూల్ డ్రింక్ సిప్ చేస్తారో.. అచ్చం అలాగే ఇతను ఆ స్ట్రాను తేనెలోకి చొప్పించాడు. ఆ తర్వాత దాన్ని (man sucked out whole honey with straw) నోటిలో పెట్టుకుని తేనెను మొత్తం జుర్రేశాడు. ఇలా తేనెటీగలను ఇబ్బంది పెట్టకుండా అక్కడ ఉన్న తేనెను మొత్తం లాగించేశాడు.

Viral Video: ఆలయాన్ని చుట్టుముట్టిన వరదనీరు.. కోనేటి మధ్యలో దృశ్యం చూసి అంతా షాక్..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘అదేమైనా కూల్‌డ్రింక్ అనుకున్నావా.. అలా తాగేస్తు్న్నావ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 800కి పైగా లైక్‌లు, 73 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 19 , 2024 | 12:03 PM