Share News

Viral Video: ఆలయాన్ని చుట్టుముట్టిన వరదనీరు.. కోనేటి మధ్యలో దృశ్యం చూసి అంతా షాక్..

ABN , Publish Date - Oct 19 , 2024 | 10:35 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. భారీ వర్షాల కారణంగా వరద నీరు పోటెత్తింది. ఈ క్రమంలో వరద నీరు మొత్తం ఆలయాన్ని చుట్టుముట్టింది. అయితే ఈ క్రమంలో అంతా ఆశ్చర్యపోయే ఘటన చోటు చేసుకుంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

Viral Video: ఆలయాన్ని చుట్టుముట్టిన వరదనీరు.. కోనేటి మధ్యలో దృశ్యం చూసి అంతా షాక్..

టెక్నాలజీ రోజు రోజుకూ ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. ఈ సృష్టిలో ఇప్పటికీ మానవుడికి తెలీని అనేక వింతలు, విశేషాలు దాగి ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రోజూ ఏదో ఒక చోట ఏదో అద్భుతం జరుగడం, దానిపై పరిశోధనలు సాగించడం పరిపాటిగా మారడం చూస్తున్నాం. ఇలాంటి వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వరదనీరు రామాలయాన్ని చుట్టుముట్టింది. అయితే అక్కడే ఉన్న కోనేటి మధ్యలో దృశ్యం చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో వరద నీరు పోటెత్తింది. ఈ క్రమంలో వరద నీరు (flood water) మొత్తం స్థానికంగా ఉన్న రామేశ్వర ఆలయాన్ని (temple) చుట్టుముట్టింది. అయితే ఈ క్రమంలో అంతా ఆశ్చర్యపోయే ఘటన చోటు చేసుకుంది.

Viral Video: పానీపూరీ అంటే ఇష్టమా.. వీళ్లెలా చేస్తున్నారో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఆలయ ఆవరణలో ఉన్న కోనేటిలో మాత్రం వరద నీరు కనిపించలేదు. కోనేటి దాకా వెళ్లిన వరద నీరు.. లోపలికి మాత్రం వెళ్లలేకపోతోంది. అలాగో కోనేటిలో ఉన్న నీరు కూడా బయటికి రాలేదు. కానీ కోనేటి చుట్టూ మాత్రం మొత్తం వరద నీరే నిండిపోయింది. అలాగే అటువైపు కూడా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఈ స్థాయిలో ప్రవహిస్తున్నా కోనేటిలో కలవకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Viral Video: వామ్మో.. దఢ పుట్టిస్తున్న వీడియో.. ఖడ్గమృగాన్ని ఈ సింహం ఎలా తింటుందో చూస్తే..


అయితే మరికొందరు మాత్రం ఈ వీడియో ఫేక్ అంటూ ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’... అంటూ కొందరు, ‘‘ఇది మాయా లేక సైన్సా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొదంరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 19 , 2024 | 10:35 AM