Share News

Viral Video: పానీపూరీ అంటే ఇష్టమా.. వీళ్లెలా చేస్తున్నారో చూస్తే.. నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Oct 18 , 2024 | 01:52 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ దుకాణంలో కొందరు కార్మికులు పానీపూరీలను తయారు చేస్తున్నారు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటాన్నారా.. వాళ్లు పానీపూరీ చేస్తున్న పద్ధతిని చూసి అంతా అవాక్కవుతున్నారు..

Viral Video: పానీపూరీ అంటే ఇష్టమా.. వీళ్లెలా చేస్తున్నారో చూస్తే.. నోరెళ్లబెడతారు..

కొందరు వింత వింత రెసిపీలతో వంటలను సిద్ధం చేసి భోజన ప్రియులను ఆకట్టుకుంటుంటే.. మరికొందరు మాత్రం వంట చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు పానీపూరీ తయారీలో చేసిన పనులు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జార్ఖండ్‌లోని (Jharkhand) గర్వా పరిధి మజియాన్వ్ మార్కెట్‌లోని దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణంలో కొందరు కార్మికులు పానీపూరీలను తయారు చేస్తున్నారు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటాన్నారా.. వాళ్లు పానీపూరీ చేస్తున్న పద్ధతిని చూసి అంతా అవాక్కవుతున్నారు. పానీపూరీల (Panipuri) కోసం పిండిని సిద్ధం చేసే సమయంలో ముందుగా అందులో నీళ్లు వేసి కలిపారు. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్స్ చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

Viral Video: పేరుకే చిన్నారి.. తల్లి ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపించిందిగా..


పిండిని నేలపై ఉంచి, ఇద్దరు వ్యక్తులు దానిపై నిలబడి (Workers mixing panipuri with legs) కాళ్లతో తొక్కుతున్నారు. ఇలా పిండిని చాలా సేపు కాళ్లతో తొక్కుతూ మిక్స్ చేశారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ అవడంతో పోలీసులు స్పందించారు. వెంటనే సదరు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. అయితే సదరు కార్మికులు పిండిని కాళ్లతో తొక్కడమే కాకుండా.. రుచి కోసం అందులో రసాయనాలు, యూరియా కూడా కలుపుతన్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు వారిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.

Viral Video: కామ్‌గా ఉన్న ఎద్దును కెలికితే ఇలాగే ఉంటుంది మరీ.. వీడియో చూస్తే పగలబడి నవ్వాల్సిందే..


పరీక్షల నిమిత్తం పిండిని ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టులో పిండిలో రసాయనాలు కలిపినట్లు తేలితే కార్మికులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇకపై పానీపూరీ తినాలంటేనే ఆలోచించాలేమో’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3వేలకు పైగా లైక్‌లు, 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 18 , 2024 | 01:53 PM