Share News

Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం.. తన ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ..

ABN , Publish Date - Oct 04 , 2024 | 07:33 PM

ప్రాణాలు ఇచ్చేంత ప్రేమకు నిదర్శనం ఏంటని అడిగితే.. తల్లి అని ఒక్క మాటలో చెప్పొచ్చు. తల్లి ప్రేమకు మించినది ఈ సృష్టిలో మరోటి లేదు అనడంలోనూ ఎలాంటి సందేహం లేదు. కాలం మారుతున్నా.. మనుషులు మారుతున్నా.. తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. పొత్తిళ్లలో..

Viral Video:  తల్లి ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం.. తన ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ..

ప్రాణాలు ఇచ్చేంత ప్రేమకు నిదర్శనం ఏంటని అడిగితే.. తల్లి అని ఒక్క మాటలో చెప్పొచ్చు. తల్లి ప్రేమకు మించినది ఈ సృష్టిలో మరోటి లేదు అనడంలోనూ ఎలాంటి సందేహం లేదు. కాలం మారుతున్నా.. మనుషులు మారుతున్నా.. తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. పొత్తిళ్లలో బిడ్డను ఎలా ప్రేమిస్తుందో.. ఆ పిల్లాడు పెరిగి పెద్దవుతున్నా తల్లి ప్రేమ మాత్రం ఒకేలా ఉంటుంది. తన బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిస్తే.. తన ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ రక్షించుకుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ తల్లి తన బిడ్డను కాపాడుకున్న తీరు చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పంజాబ్‌లోని (Punjab) లూథియానాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్ ఓల్డ్ బజార్‌లో మంగళవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో పాత భవనాలు చాలా ఉన్నాయి. వీటిలో సుమారు 100 ఏళ్ల నాటి ఓ భవనం ఉంది. ఇది ప్రస్తుతం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది.

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఈ క్రమంలో మంగళవారం (hundred year old building has collapsed) ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ఆ సమయంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భవనం కూలిపోవడాన్ని గమనించిన చుట్టు పక్కల వారు పరుగందుకున్నారు. అంతా కేకలు వేస్తూ అటూ, ఇటూ పరుగెత్తడాన్ని వీడియోలో చూడొచ్చు. ఈ క్రమంలో ఓ మహిళ (woman) తన బిడ్డను ఎత్తుకుని అటుగా వచ్చింది. అయితే బిల్డింగ్ కూలిపోవడాన్ని గమనించి, తన బిడ్డను గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీసింది, అయితే అప్పటికే బిల్డింగ్ కూలిపోవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా దుమ్ము, ధూళి లేచింది.

Viral Video: ఈ సింహాలు సినిమాలు చూసి అప్డేట్ అయ్యాయేమో.. దాడి చేయడంలో ఎలాంటి స్కెచ్ వేశాయో చూస్తే..


ఈ ప్రమాదంలో తల్లీబిడ్డ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అలాగే ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడినట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తల్లి ప్రేమకు నిదర్శనం అంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘థ్యాంక్స్ గాడ్.. ఎవరికీ ఏమీ కాలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వధువుతో డాన్స్ చేస్తున్న వరుడు.. సడన్‌గా ఫ్యాంట్ చూసుకుని షాక్.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 04 , 2024 | 07:33 PM