Share News

Viral Video: పెద్ద చేప పడిందని సంబరపడ్డాడు.. చేతిలోకి తీసుకోగానే.. ఉన్నట్టుండి షాకింగ్ సీన్..

ABN , Publish Date - Sep 04 , 2024 | 07:55 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొందరు నీటి మడుగులో చేపలు పడుతుంటారు. ఇంతలో ఓ వ్యక్తి వల వేయగానే పెద్ద చేప పడుతుంది. వలను పైకి ఎత్తి చేపను పరిశీలిస్తూ ఉంటాడు. ఇంతలో మరో వ్యక్తి ..

Viral Video: పెద్ద చేప పడిందని సంబరపడ్డాడు.. చేతిలోకి తీసుకోగానే.. ఉన్నట్టుండి షాకింగ్ సీన్..

చేపల వేటలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చేపల కోసం వల వేస్తే చిత్రవిచిత్ర జీవులన్నీ పడిపోతుంటాయి. కొన్నిసార్లు చేపలకు బదులుగా పాములు, కొండచిలువలు పడితే.. మరికొన్నిసార్లు తాబేళ్లు, మొసళ్లు పడడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, చేపల వేటలో ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. పెద్ద చేప పడిందని సంబరపడ్డాడు. అయితే తీరా చేతిలోకి తీసుకోగానే ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు నీటి మడుగులో (fishing) చేపలు పడుతుంటారు. ఇంతలో ఓ వ్యక్తి వల వేయగానే పెద్ద చేప పడుతుంది. వలను పైకి ఎత్తి చేపను పరిశీలిస్తూ ఉంటాడు. ఇంతలో మరో వ్యక్తి అక్కడికి పరుగు పరుగున వస్తాడు. పెద్ద చేప పడిందని సంతోషిస్తూ వెంటనే దాన్ని చేతిలోకి తీసుకుంటాడు.

Viral Video: స్కూటీపై లగేజీ తీసుకెళ్తున్న వ్యక్తిపై అనుమానం.. చివరకు సమీపానికి వెళ్లి చూడగా.. కళ్లు జిగేల్‌మనే సీన్..


అయితే చేపను ఇలా చేతిలోకి తీసుకోగాలనే షాక్ (electric shock) తగిలి నీటిలో పడిపోతాడు. చాలా సేపు గిలాగిలా కొట్టుకుంటుంటాడు. ఇంతలో పక్కన ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్లి వలను పక్కకు లాగి అతన్ని రక్షిస్తాడు. ఎట్టకేలకు క్షేమంగా పైకి లేచిన ఆ వ్యక్తి చేపను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. కోపంతో దాన్ని కాలితో తన్నుతాడు. అయితే ఎట్టకేలకు అతడికి ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు.

Viral Video: భార్యాభర్తలు వంట గదిలో ఉండగా సడన్‌ షాక్.. కళ్లు మూసి తెరిచే లోపే..


చూస్తుంటే ఆ చేప కరెంట్ షాక్ కొట్టే ఈల్ చేపలా అనిపిస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పెద్దాయనకు షాక్ ఇచ్చిన ఈల్ చేప’’.. అంటూ కొందరు, ‘‘చావు అంచుల దాకా వెళ్లి రావడం అంటే ఇదేనేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Optical illusion: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలున్నాయి.. అవేంటో 30 సెకన్లలో కనుక్కుంటే మీరే తోపు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 04 , 2024 | 07:55 PM