Share News

Viral Video: స్పైడర్ మ్యాన్‌కు ఏమాత్రం తగ్గడుగా.. ఈ పిల్లాడు చేస్తున్న ఫీట్ చూస్తే మతిపోవాల్సిందే..

ABN , Publish Date - Sep 04 , 2024 | 05:13 PM

కొందరు పిల్లల ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. మరికొందరు పిల్లలు చేసే పనులు చేస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇంకొందరు పిల్లలు పెద్దలు కూడా చేయలేని పనిని ఎంతో ఈజీగా చేసేస్తుంటారు. ఇలాంటి పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: స్పైడర్ మ్యాన్‌కు ఏమాత్రం తగ్గడుగా.. ఈ పిల్లాడు చేస్తున్న ఫీట్ చూస్తే మతిపోవాల్సిందే..

కొందరు పిల్లల ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. మరికొందరు పిల్లలు చేసే పనులు చేస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇంకొందరు పిల్లలు పెద్దలు కూడా చేయలేని పనిని ఎంతో ఈజీగా చేసేస్తుంటారు. ఇలాంటి పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పిల్లాడి విన్యాసాల వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లాడు స్తంభంపై చేసిన విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ పిల్లాడు స్పైడర్ మ్యాన్‌కు ఏమాత్రం తగ్గడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లాడి వినూత్న విన్యాసాలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. కుర్చీలో కూర్చుని ఉన్న ఓ పిల్లాడు అందులో నుంచి ఒక్కసారిగా ఎదురుగా ఉన్న స్తంభంపైకి జంప్ చేస్తాడు. స్తంభాన్ని పట్టుకుని కిందపడకుండా చాకచక్యంగా పైకి ఎక్కేస్తాడు. అది కూడా ఎంతో అవలీలగా.. స్పైడర్ మ్యాన్ తరహాలో చకచకా పైకి ఎక్కుతాడు.

Viral Video: దాడి చేయాలని చూసిన జంట సింహాలకు.. ఈ కుక్క ఎలా బుద్ధి చెప్పిందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


స్తంభం పైకి ఎక్కిన తర్వాత రెండు చేతులతో పట్టుకుని గాలిలో వేలాడతాడు. ఇలా అటూ ఇటూ కాళ్లను వేలాడదీసి, ఆ తర్వాత మళ్లీ చకచకా కిందకు వచ్చేస్తాడు. ఇలా పైకి, కిందకు వెళ్తూ స్పైడర్ మ్యాన్‌ను (boy climbing pillar like SpiderMan) మరిపించేలా ప్రవర్తిస్తాడు. అతడిని చూసి మరో పిల్లాడు కూడా అలాగే చేయాలని చూస్తాడు. కానీ అతడి వల్ల సాధ్యం కాక సైలెంగ్‌గా నిలబడి చూస్తుంటాడు.

Optical illusion: ఈ వంట గదిలోని ఎలుకను 20 సెకన్లలో గుర్తిస్తే.. మీకు తిరుగు లేనట్లే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇంట్లో తిరుగుతున్న స్పైడర్ మ్యాన్’’.. అంటూ కొందరు, ‘‘ఈ బుడ్డోడి విన్యాసాలతో స్పైడర్ మ్యాన్ కెరీర్ డేంజర్‌లో పడ్డట్లే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.90లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 04 , 2024 | 05:13 PM