Share News

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Sep 04 , 2024 | 04:12 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పెద్ద రాయి మీద కూర్చుని మందు తాగుతుంటాడు. అయితే మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. సదరు వ్యక్తి మందు తాగుతున్న సమయంలో ఓ నాగుపాము అటుగా వస్తుంది. మందు తాగుతుండగా మధ్యలో..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

పాములను చూస్తే ఎవరికైనా ఒంట్లో వణకుపుడుతుంది. దాని సమీపానికి కాదు కదా.. దూరం నుంచి చూడ్డానికి కూడా భయపడిపోతారు. అయితే కొందరు మాత్రం వాటితో పరాచకాలు ఆడుతుంటారు. ఇక మందుబాబుల చేష్టల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. వాటిని తాడులా భావించి నడుముకు కట్టుకోవడం, మెడలో వేసుకోవడం చేస్తుంటారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి పాముకు పదే పదే ముద్దులు కూడా పెడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మందు కొడుతుండగా.. ఓ నాగుపాము అటుగా వస్తుంది. పామును చేతిలోకి తీసుకున్న అతను.. చివరకు ఏం చేశాడో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పెద్ద రాయి మీద కూర్చుని మందు తాగుతుంటాడు. అయితే మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. సదరు వ్యక్తి మందు తాగుతున్న సమయంలో ఓ నాగుపాము అటుగా వస్తుంది. మందు తాగుతుండగా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా.. అని అనకుంటూ నాగుపామును చేతిలోకి తీసుకుంటాడు. దీంతో పాము ఒక్కసారిగా పడగ ఎత్తి బుస కొడుతుంది.

Viral Video: వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. తనని నిర్లక్ష్యం చేశాడనే కోపంతో.. వేదికపైకి పైకి వెళ్లిన వెంటనే..


అయినా ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకుండా పామును దగ్గరగా (drunken man caught a cobra) తీసుకుని కళ్లలో కళ్లు పెట్టి చూస్తాడు. అయితే ఆ సమయంలో పడగ విప్పిన పాము.. అతడిపై కాటు వేయకుండా అలాగే చూస్తుండిపోతుంది. ఇంతలో ఆ వ్యక్తి పామును ధబేల్‌మని కింద పడేస్తాడు. కిందపడిన పాము అక్కడే ఆగి బుసలు కొడుతూ.. ‘‘ఏంట్రా.. నేనంటే నీకు కొంచెం కూడా భయం లేదా’’.. అన్నట్లుగా అతడి వైపే చూస్తుండిపోతుంది. పామును కిందపడేసిన ఆ వ్యక్తి ఆ తర్వాత ఏదో గొప్ప పని చేసినట్లు ఫీలవుతూ మందు తాగుతుంటాడు.

Optical illusion: ఈ వంట గదిలోని ఎలుకను 20 సెకన్లలో గుర్తిస్తే.. మీకు తిరుగు లేనట్లే..


పామును పట్టుకున్న సమయంలో కాటు వేసి ఉంటే ప్రాణాలే పోయేవి. అయితే అదృష్టం బాగుండి పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మందుబాబా.. మజాకా..’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం చాలా ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: దాడి చేయాలని చూసిన జంట సింహాలకు.. ఈ కుక్క ఎలా బుద్ధి చెప్పిందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 04 , 2024 | 04:12 PM