Share News

Viral Video: కష్టపడి నది దాటుకుని వెళ్లిన వృద్ధులు.. చివరకు అసలు కారణం తెలిసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..

ABN , Publish Date - Sep 21 , 2024 | 11:02 AM

కొందరు చేసే చేష్టలు అందరినీ ఆగ్రహాన్ని తెప్పిస్తుంటాయి. మరికొందరు చేసే పనులు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. కొందరు చేసే పనులు, వాటి వెనుక గల కారణాలు తెలిసినప్పుడు ఆశ్చర్యం కూడా కలుగుతుంటుంది. ఇలాంటి విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరు వృద్ధులు కష్టపడి నదిని దాటుకుని వెళ్లారు. దానికి గల కారణం తెలుసుకుని అంతా అవాక్కవుతున్నారు..

Viral Video: కష్టపడి నది దాటుకుని వెళ్లిన వృద్ధులు.. చివరకు అసలు కారణం తెలిసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..

ఎవరి పిచ్చి వారికి ఆనందం.. అన్న చందంగా కొందరు దురవాట్లకు బానిసలై.. ఏం చేయడానికైనా వెనుకడని స్థితికి చేరుకుంటుంటారు. మందు, గంజాయి తీసుకునే వాళ్లు.. వాటి కోసం ఎలాంటి సాహసాలు చేయడానికైనా వెనుకాడరు. తాగిన తర్వాత వారు చేసే పనులు ఎలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయో.. వాటి కోసం పడే చేసే ప్రయత్నాలు కూడా అంతే నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు వృద్ధులు కష్టపడి నది దాటుకుని వెళ్లారు. చివరకు అసలు కారణం తెలుసుకుని అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మద్యానికి బానిసైన ఇద్దరు వృద్ధులకు (old people) ఓ రోజు మందు తాగాలని అనిపించింది. అయితే వర్షాల కారణంగా ఎక్కడ చూసినా వరద నీరు నిండిపోయి కనీసం నడవడానికీ ఇబ్బందిగా మారిన పరిస్థితి. అయినా ఎలాగైనా మద్యం (alcohol) తాగాలని డిసైడ్ అయ్యారు.

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..


అయితే ఇలాంటి వారి కోసమే అన్నట్లుగా ఓ వ్యక్తి.. వరద నీటిలోనే (flood water) దుకాణం ఓపెన్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న వృద్ధులకు ప్రాణం లేచొచ్చినట్లు అయింది. వెంటనే వదర నీటిని లెక్కచేయకుండా నడవడం మొదలెట్టారు. చివరకు ఆ మద్యం షాపును చేరుకున్నారు. మోకాళ్ల నీటిలో తెరిచి ఉన్న దుకాణం వద్దకు అతి కష్టం మీద చేరుకుని తమ కోరికను తీర్చుకున్నారు.

Viral Video: సైకిల్‌ను చోరీ చేసి, గేటు దూకి పోరిపోతున్న దొంగ.. సడన్‌గా పొడవాటి వ్యక్తి ఎంట్రీ.. చివరకు..


ఈ వృద్ధులను చూసి అంతా అవాక్కవుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘ఈ వృద్ధుల సాహసం మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 21 , 2024 | 11:02 AM