Viral Video: ఈ కారును చోరీ చేయడం ఎవరి తరమూ కాదు.. యజమాని ఏర్పాట్లు చూస్తే.. షాకవడం ఖాయం..
ABN , Publish Date - Jul 19 , 2024 | 09:02 PM
దొంగల బారి నుంచి తమ నగదు, నగలు, వివిధ వస్తువులను కాపాడుకునేందుకు కొందరు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే వాహనాలు చోరీ కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ...
దొంగల బారి నుంచి తమ నగదు, నగలు, వివిధ వస్తువులను కాపాడుకునేందుకు కొందరు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే వాహనాలు చోరీ కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే క్రమంలో కొందరు చిత్రవిచిత్ర ప్రయత్నాలు చేయడం చూస్తుంటాం. కారుపై కవర్ కప్పి దానిపై ప్లాస్టిక్ ముళ్లను ఏర్పాటు చేసిన వ్యక్తిని చూశాం. అలాగే కూలర్ చోరీ కాకుడా గోడ మధ్యలో ఏర్పాటు చేసిన వారిని కూడా చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కారు చోరీ కాకుండా తీసుకున్న జాగ్రత్తలు చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌కు (Pakistan) చెందిన ఓ కారు యజమాని (Car owner) .. తన వాహనం చోరీ కాకుండా వినూత్న చర్యలు తీసుకున్నాడు. డూప్లికేట్ తాళాలను ఉపయోగించి తన కారును చోరీ చేస్తారనే భయంతో చివరకు వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. డూప్లికేట్ తాళాలతో వచ్చినా సరే.. వాహనాన్ని తీసుకెళ్లకుండా ఉండేలా పగడ్బందీ ఏర్పాట్లు చేశాడు. డ్రైవింగ్ సీటు కింద ఉన్న ఎక్సలేటర్, క్లచ్, బ్రేకులపై ఇనుప బాక్స్ ఏర్పాటు చేశాడు. దానికి బీరువా తరహాలో బలమైన లాకర్ ఏర్పాటు చేశాడు.
Viral Video: గేటు దాటి లోపలికి వెళ్లిన డెలివరీ బాయ్... పెంపుడు కుక్కలే కదా అనుకుంటే.. చివరకు..
ఇనుప డోరు మూయడం ద్వారా అక్కడ క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అతడి వద్ద ఉన్న కీతో మాత్రమే అది తెరుచుకునేలా దాన్ని తయారు చేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యజమాని తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘హైలెవల్ సెక్యూరిటీ అదే ఇదే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: పిల్లతో కలిసి నదిలోకి దిగిన తల్లి ఏనుగు.. సడన్‌గా హిప్పోల రాకతో మారిన సీన్.. చివరకు..