Share News

Viral Video: ఇది కనీవినీ ఎరుగని వీడ్కోలు.. వధువును ఎలా తీసుకెళ్తున్నారో చూస్తే..

ABN , Publish Date - Oct 01 , 2024 | 09:08 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో ఉన్నట్టుండి అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది. తాళి కట్టే తంతు పూర్తయిన అనంతరం వధువుకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమవుతుంది. ఇంతవరకూ అంతా సవ్యంగా సాగినా.. ఇక్కడే..

Viral Video: ఇది కనీవినీ ఎరుగని వీడ్కోలు.. వధువును ఎలా తీసుకెళ్తున్నారో చూస్తే..

ప్రస్తుతం చాలా వివాహాలకు సంబంధించిన వీడియోలు.. సినిమాలకు మించిన వినోదాన్ని అందిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. కొన్నిసార్లు సినిమా సీన్లను తలదన్నే ఘటనలు కూడా చోటు చేసుకోవడం చూస్తుంటాం. వధూవరులకు ఒకరిపై మరొకరు ప్రాంక్‌లు చేసుకోవడం, స్నేహితులంతా కలిసి వధూవరులను ఆపట్టించడం.. ఇలా అనేక సంఘటనలకు సంబందించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఓ వధువుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వధువుకు వీడ్కోలు పలుకుతున్న విధానం చూసిన నెటిజన్లు.. ‘‘ఇది కనీవినీ ఎరుగని వీడ్కోలు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో ఉన్నట్టుండి అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది. తాళి కట్టే తంతు పూర్తయిన అనంతరం వధువుకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమవుతుంది. ఇంతవరకూ అంతా సవ్యంగా సాగినా.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. సాధారణంగా వీడ్కోలు సమయంలో వధువు (bride) పట్టింటిని వదిలి వెళ్లలేక ఏడవడం చూస్తుంటాం.

Viral Video: ఏనుగుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.. ఆటో డ్రైవర్ ఎదురుగా వెళ్లడంతో.. చివరకు..


మరికొందరు వధువులు ఇళ్లు వదిలి వెళ్లేందుకు ఇబ్బంది పడుతుంటే.. బంధువులు బలవంతంగా తీసుకెళ్లడం కూడా చూస్తుంటాం. అయితే తాజాగా, చోటు చేసుకున్న ఘటనలో వధువు మరింత విచిత్రంగా ప్రవర్తించింది. వివాహం పూర్తవగానే ఆమెకు ఎక్కడ లేని బాధ పొంగుకొచ్చింది. పుట్టింటిని వదిలి వెళ్లడం ఇష్టం లేక.. తాను వెళ్లనంటూ భీష్మించుకుంది. దీంతో వధువు తల్లిదండ్రులతో పాటూ అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. చాలా మంది ఆమెకు నచ్చజెప్పి చూశారు. ఎవరు ఎన్ని చెప్పినా తాను మాత్రం పుట్టింటిని విడిచి వెళ్లేదే లేదంటూ తెగేసి చెప్పింది.

Viral Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. బైకర్‌ను వెంటబడిన ఖడ్గమృగం.. చివరకు ఏం చేసిందో చూస్తే..


ఎంత సేపు బ్రతిమాలినా ఆమె వినకపోవడంతో చివరకు అంతా కలిసి బలవంతంగా ఎత్తుకెళ్లి కారులో కూర్చోబెట్టాల్సి వచ్చింది. వాళ్లు ఎత్తుకెళ్తుండగా.. ఆమె ఏడుస్తూ గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారంతా అక్కడ గుమికూడారు. ఇలా చివరకు వధువుకు బలవంతంగా వీడ్కోలు పలకాల్సి వచ్చింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వీడ్కోలు ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘వధువును చూస్తుంటే జాలేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఎస్కలేటర్ ఎక్కిన యువతులు.. ఉన్నట్టుండి కిందకు దిగి ఏం చేశారో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 01 , 2024 | 09:08 PM