Share News

Viral Video: చెట్టెక్కినా వదలని ఎలుగుబంటి.. కాలు పట్టుకుని కిందకు లాగేయడంతో.. చివరకు..

ABN , Publish Date - Sep 29 , 2024 | 07:29 PM

ఎలా జరిగిందో తెలీదు గానీ.. ఓ వ్యక్తి ఎలుగుబంటికి ఎదురుపడతాడు. అతన్ని చూడగానే ఎలుగుబంటి వెంబడిస్తుంది. దాన్నుంచి తప్పించుకోవడానికి వేగంగా పరుగెత్తుతాడు. అయినా ఎలుగుబంటి అతన్ని వదలకుండా వెంటపడుతుంది. దీంతో..

Viral Video: చెట్టెక్కినా వదలని ఎలుగుబంటి.. కాలు పట్టుకుని కిందకు లాగేయడంతో.. చివరకు..

మనుషులపై పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు దాడులు చేయడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు కొందరు ఇలాంటి ప్రమాదాల నుంచి అదృష్టవశాత్తు క్షేమంగా బయటపడుతుంటారు. ఈ తరహా షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఎలుగుబంటి నుంచి తప్పించుకోవడానికి చెట్టు ఎక్కాడు. అయినా ఎలుగుబంటి అతన్ని వదలకుండా వెంబడిస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఎలా జరిగిందో తెలీదు గానీ.. ఓ వ్యక్తి ఎలుగుబంటికి ఎదురుపడతాడు. అతన్ని చూడగానే ఎలుగుబంటి వెంబడిస్తుంది. దాన్నుంచి తప్పించుకోవడానికి వేగంగా పరుగెత్తుతాడు. అయినా ఎలుగుబంటి అతన్ని వదలకుండా వెంటపడుతుంది. దీంతో చివరకు ఆ వ్యక్తి దాన్నుంచి తప్పించుకునే క్రమంలో చివరకు సమీపంలోని ఓ చెట్టు ఎక్కుతాడు.

Viral Video: ఇలాంటి చేపలను ఎప్పుడైనా చూశారా.. సముద్ర గర్భంలో ఎలా నడుస్తున్నాయో చూస్తే..


అప్పటికీ ఎలుగుబంటి (bear chased man) అతన్ని విడిచిపెట్టదు. చెట్టు ఎక్కుతున్న అతన్ని కాలు పట్టుకుని కిందకు లాగేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఎలాగోలా ఎలుగుబంటిని గట్టిగా తన్ని విడిపించుకుంటాడు. ఇలా ఆ ఎలుగుబంటి చాలా సేపు చెట్టు వద్దే నిలబడి అతన్ని కిందకు లాగాలని చూస్తుంది. మధ్యలో చెట్టు ఎక్కే ప్రయత్నం కూడా చేస్తుంది. అయితే చివరకు సాధ్యం కాక.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Viral Video: వామ్మో.. ఇది మాయా.. లేక మంత్రమా.. వైట్ పేపర్లను ఇతనెలా మారుస్తున్నాడో చూస్తే..


ఇలా ఎలుగుబంటి దాడి నుంచి అతను తృటిలో తప్పించుకుంటాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఇతడి టైం ఎంతో బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘వీడియో తీస్తున్న వ్యక్తి చోద్యం చూడడం దారుణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 18 మిలియన్లకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: దండలు మార్చుకుంటుండగా వరుడికి ఊహించని షాక్.. ఉన్నట్టుండి వేదిక పైకి వచ్చిన యువకుడు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 29 , 2024 | 07:29 PM