Share News

Viral video: బెడ్‌ బాగుందని కునుకు తీస్తున్నారా.. జాగ్రత్త..! ఇలాంటి ప్రమాదం కూడా పొంచి ఉండొచ్చు..

ABN , Publish Date - Jun 14 , 2024 | 06:48 PM

రోజూ చేసే పనులే అయినా.. కొన్నిసార్లు ఆచితూచి చేయాల్సి ఉంటుంది. లేదంటే ఏ వైపు నుంచి ఏ ప్రమాదమైనా పొంచి ఉండొచ్చు. చాలా మంది ఏమరపాటులో చేసే పనులు చివరకు ప్రాణాల మీదకు తెచ్చిన సందర్బాలను చాలా చూశాం. ఇప్పుడిదంతా..

Viral video: బెడ్‌ బాగుందని కునుకు తీస్తున్నారా.. జాగ్రత్త..! ఇలాంటి ప్రమాదం కూడా పొంచి ఉండొచ్చు..

రోజూ చేసే పనులే అయినా.. కొన్నిసార్లు ఆచితూచి చేయాల్సి ఉంటుంది. లేదంటే ఏ వైపు నుంచి ఏ ప్రమాదమైనా పొంచి ఉండొచ్చు. చాలా మంది ఏమరపాటులో చేసే పనులు చివరకు ప్రాణాల మీదకు తెచ్చిన సందర్బాలను చాలా చూశాం. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బెడ్‌పై పడుకుందామని వెళ్లాడు. అయితే తీరా పడుకునే ముందు బెడ్‌పై దృశ్యం చూసి షాక్ అయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి విశ్రాంతి తీసుకునేందుకు తన బెడ్ రూమ్‌కు వెళ్లాడు. తీరా బెడ్‌పై పడుకునే ముందు దానిపై కనిపించిన దృశ్యం చూసి ఖంగుతిన్నాడు. ఓ పెద్ద పాము (Snake on the bed) దుప్పటిలో నుంచి బయటికి వచ్చి బెడ్‌పై ఉన్న చార్జర్ వైరును కొరుకుతూ మెలికలు తిరుగుతోంది. వైరును గట్టిగా కొరుకుతూ బెడ్ మొత్తం అటూ, ఇటూ తిరుగుతోంది.

Viral video: ఈ యువతి తెలివి మామూలుగా లేదుగా.. హోటల్లో ప్రియుడికి లిప్‌స్టిక్‌తో ఎలా షాక్ ఇచ్చిందో చూడండి..


ఈ దృశ్యం చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పాము ఇలా చాలా సేపు చార్జర్ వైరును పట్టుకుని బెడ్ పైనే ఉంది. గమనించకుండా బెడ్‌పై పడుకుని ఉండుంటే.. పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘బెడ్‌పై పడుకోవాలంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: నిప్పుతో చెలగాటమాడితే ఇలాగే ఉంటుంది మరి.. ఈ యువకుడికి ఏమైందో చూడండి..

Updated Date - Jun 14 , 2024 | 06:56 PM