Share News

Viral video: నీటి గుర్రం పవరేంటో ఎప్పుడైనా చూశారా.. మూడు సింహాలను సైతం ఒక్కసారిగా..

ABN , Publish Date - Jun 28 , 2024 | 08:36 PM

కొన్ని కొన్ని జంతువులకు స్థాన బలం ఎక్కువగా ఉంటుంది. మొసళ్లకు నీటిలో ఎంత బలం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటి స్థావరాల్లోకి ఎలాంటి జంతువు వచ్చినా ఇట్టే మట్టికరిపిస్తుంది. అలాగే ..

Viral video: నీటి గుర్రం పవరేంటో ఎప్పుడైనా చూశారా.. మూడు సింహాలను సైతం ఒక్కసారిగా..

కొన్ని కొన్ని జంతువులకు స్థాన బలం ఎక్కువగా ఉంటుంది. మొసళ్లకు నీటిలో ఎంత బలం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటి స్థావరాల్లోకి ఎలాంటి జంతువు వచ్చినా ఇట్టే మట్టికరిపిస్తుంది. అలాగే నీటి గుర్రానికి కూడా నీళ్లలో ఉన్న సమయంలో బలం అమితంగా ఉంటుంది. ఆ సమయంలో ఎలాంటి జంతువైనా వాటి జోలికి వెళ్లడానికి సాహసించవు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నీళ్లలోకి వచ్చిన మూడు సింహాలను ఓ నీటి గుర్రం హడలెత్తించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ అడవిలో మూడు సింహాలు కలిసి ఓ నదిని దాటేందుకు ప్రయత్నిస్తుంటాయి. మూడు సింహాలు కలిసి ఒకదానివెనుక మరొకటిగా నీటిలోకి దిగతాయి. ఈత కొడుతూ నది మధ్యలోకి వెళ్లగానే కాస్త దూరంలో ఉన్న నీటి గుర్రం వాటిని గమనిస్తుంది. అంతే, సింహాలను చూడగానే దానికి కోపం కట్టలు తెంచుకుంటుంది. అత్యంత వేగంగా ఈదుతూ వాటి వద్దకు వెళ్తుంది. నీటి గుర్రం రావడాన్ని చూసిన మూడు సింహాల్లో ఒకటి వెనక్కు తిరిగి ఈదుకుంటూ వెళ్లి గట్టుకు చేరుకుంటుంది. దీంతో మిగతా రెండు సింహాలను (hippo attacked the lions) టార్గెట్ చేసిన నీటి గుర్రం.. వాటి పైకి దూకేస్తుంది.

Viral video: ఆశ్చర్యపరుస్తున్న కోతి.. పిల్లి వద్దకు వెళ్లి అది చేసిన పని చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


రెండింటిలో ఒక సింహం పక్కకు పారిపోవడంతో మిగిలిన ఒక సింహాన్ని కొరికే ప్రయత్నం చేస్తుంది. అయితే అప్పటికే గట్టుకు చేరుకున్న సింహం.. నీటి గుర్రం బారి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి ‘‘బతుకు జీవుడా’’.. అనుకుంటూ పారిపోతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహాలకు చుక్కలు చూపించిన నీటి గుర్రం’’.. అంటూ కొందరు, ‘‘స్థానబలం అంటే ఇదేనేమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: దూడకు జన్మనిచ్చిన గేదె.. పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. ట్విస్ట్ ఏంటో తెలిస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Jun 28 , 2024 | 08:36 PM