Share News

Viral Video: గుడి ముందు పడుకున్న వ్యక్తి.. ఉన్నట్టుండి తల కిందకు దూరిన పాము.. చివరకు..

ABN , Publish Date - Jul 11 , 2024 | 09:43 AM

పాములు ఎప్పుడు ఎటు వైపు నుంచి వస్తాయో కూడా చెప్పలేం. కొన్నిసార్లు మంచాల నుంచి బయటికి వస్తే.. మరికొన్నిసార్లు బాత్రూం కమోడ్‌ల నుంచి వస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు ఏకంగా షూలలో ...

Viral Video: గుడి ముందు పడుకున్న వ్యక్తి.. ఉన్నట్టుండి తల కిందకు దూరిన పాము.. చివరకు..

పాములు ఎప్పుడు ఎటు వైపు నుంచి వస్తాయో కూడా చెప్పలేం. కొన్నిసార్లు మంచాల నుంచి బయటికి వస్తే.. మరికొన్నిసార్లు బాత్రూం కమోడ్‌ల నుంచి వస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు ఏకంగా షూలలో నుంచి కూడా బుసలు కొడుతూ బయటికి వస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గుడి ముందు పడుకుని ఉండగా.. ఓ పాము అతడి తల కిందకు దూరింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కేరళలోని (Kerala) కొడంగల్లూర్‌లోని శ్రీకురుంబ భగవతి ఆలయానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గుడి ఎదురుగా ఉన్న చెట్టు కింద నిద్రపోతుంటాడు. గాఢ నిద్రలో ఉండగా ఓ పాము (snake) అటుగా వస్తుంది. అతడు పడుకున్న గోడపైకి ఎక్కి.. చివరకు (snake crawled under sleeping man) ఏకంగా అతడి తల కిందకు దూరిపోతుంది. పాము తాకగానే ఉలిక్కిపడి పైకి లేస్తాడు. తీరా పామును చూసి భయంతో పైకి లేచి పక్కకు పారిపోతాడు.

Viral Video: కుక్క, కోడి, కోతి.. కామెడీ మామూలుగా లేదుగా.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..


అయితే పాము మాత్రం అతడికి ఎలాంటి హానీ చేయకుండా అటు నుంచి అటే మరో చెట్టు వద్దకు వెళ్తుంది. చివరకు ఓ చెట్టు కింద ఉన్న దేవుడి ఫొటోల వద్దకు వెళ్లి ఆగిపోతుంది. దేవుడి చిత్రపటాల వద్ద ఆగిపోయిన పామును చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: గోర్లు కొరికే అలవాటు ఉందా.. అయితే ఈ వీడియో చూస్తే.. చచ్చినా ఆ పని చేయరు..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘నిద్రపోతున్న వ్యక్తిని అలెర్ట్ చేసినందుకు కెమెరామెన్‌కు ధన్యవాదాలు’’.. అంటూ కొందరు, ‘‘అది విషం లేని పాము కావడంతో మంచిదైంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.77లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: గదిలోకి వెళ్లిన టీచర్‌తో హెచ్ఎం పాడుపని.. వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు..

Updated Date - Jul 11 , 2024 | 09:43 AM