Share News

Viral Video: అదృష్టం అంటే ఇతడితే.. 60 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకుతుండగా.. కొమ్మ విరగడంతో..

ABN , Publish Date - Jul 10 , 2024 | 05:56 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఒకరిని మించి మరొకరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేసేందుకు పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో కొందరైతే ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ అంతా షాక్ అయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి...

Viral Video: అదృష్టం అంటే ఇతడితే.. 60 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకుతుండగా.. కొమ్మ విరగడంతో..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఒకరిని మించి మరొకరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేసేందుకు పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో కొందరైతే ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ అంతా షాక్ అయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి 60 అడుగుల ఎత్తు నుంచి నీటి లోకి దూకేందుకు ప్రయత్నించాడు. అయితే ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరగడంతో చివరకు ఏమైందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. యూఎస్‌లోని ఫ్లోరిడాకు (US Florida) చెందిన క్రిస్టోఫర్ జేబ్స్ సైక్స్ స్మాలీ అనే వ్యక్తి.. ఇటీవల వినూత్న విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యాడు. వెర్నాన్‌‌లోని క్రిస్టల్ స్ర్పింగ్ ప్రాంతంలోని సరస్సు వద్దకు వెళ్లాడు. అక్కడి సరస్సులోని పెద్ద చెట్టును ఎక్కేశాడు. ఏకంగా 60 అడుగుల ఎత్తు వరకూ ఎక్కి, అక్కడి నుంచి దూకేందుకు ప్రయత్నించాడు.

Viral Video: తెలివితక్కువ పులిని ఎప్పుడైనా చూశారా.. నీటిలో పాము అనుకుని చివరకు అది చేసిన నిర్వాకం..


ఈ క్రమంలో అతను కొమ్మకు వేలాడుతూ కిందకు దూకేందుకు ప్రయత్నించగా.. ఒక్కసారిగా కొమ్మ విరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా ధబేల్‌మని కింద ఉన్న మరో కొమ్మ మీద పడి, చివరికి నేరుగా (ma fell into water from 60 feet height) నీటిలోకి పడిపోయాడు. అయితే ఈ ఘటనలో ఆశ్చర్యకరంగా అతడికి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. అదృష్టవశాత్తు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. క్రిస్టోఫర్ మాట్లాడుతూ 60 అడుగుల ఎత్తు నుంచి దూకడం ఇదే మొదటిసారి అని చెప్పాడు.

Viral Video: డ్యూటీ టైంలో నర్సులంతా కలిసి గదిలో చేసిన వింత నిర్వాకం.. చివరకు కొందరు వీడియో తీయడంతో..


అయితే కొమ్మ విరిగినా పడిపోయినా తనకు ఏమీ కాకపోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రమాదం’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి టైం చాలా బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1900 పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఏ కష్టమొచ్చిందో ఏమో గానీ.. తండ్రీకొడుకులు కలిసి రైల్వే స్టేషన్‌లో చేతులు పట్టుకుని మరీ ఇలా..

Updated Date - Jul 10 , 2024 | 05:56 PM