Share News

Viral Video: గోర్లు కొరికే అలవాటు ఉందా.. అయితే ఈ వీడియో చూస్తే.. చచ్చినా ఆ పని చేయరు..

ABN , Publish Date - Jul 11 , 2024 | 07:32 AM

చాలా మంది ఏం తోచనప్పుడు గోర్లు కొరుక్కుంటూ ఉంటారు. క్రమంగా ఇది ఒక అలవాటుగా మారిపోతుంటుంది. చివరకు చీటికిమాటికీ గోర్లు కొరకడం పరిపాటిగా మారిపోతుంటుంది. ఇలా గోర్లు కొరుక్కోవడం మంచిది కాదని తెలిసినా ..

Viral Video: గోర్లు కొరికే అలవాటు ఉందా.. అయితే ఈ వీడియో చూస్తే.. చచ్చినా ఆ పని చేయరు..

చాలా మంది ఏం తోచనప్పుడు గోర్లు కొరుక్కుంటూ ఉంటారు. క్రమంగా ఇది ఒక అలవాటుగా మారిపోతుంటుంది. చివరకు చీటికిమాటికీ గోర్లు కొరకడం పరిపాటిగా మారిపోతుంటుంది. ఇలా గోర్లు కొరుక్కోవడం మంచిది కాదని తెలిసినా చాలా మంది ఆ అలవాటును మానుకోలేరు. ఈ అలవాటు ఎంత ప్రమాదకరమో కళ్లకు కట్టినట్లు తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో గోర్లు కొరికితే ఇంత ప్రమాదమా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గోర్లలో అనేక క్రిములు దాక్కుని ఉంటాయని వైద్యులు చెబుతుంటారు. అందుకే గోర్లు కొరికే (Nail biting habit) అలవాటును మానుకోవాలని సూచిస్తుంటారు. అయినా చాలా మంది దీన్ని తేలిగ్గా తీసుకుంటుంటారు. అయితే గోర్లలో ఉండే మట్టిలో ఎన్ని క్రిములు (Germs) దాగి ఉంటాయో తెలిపే ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. గోర్లలో ఉన్న మట్టిని బయటికి తీసి, దానిపై రసాయనం వేసి చివరగా దాన్ని మైక్రోస్కోప్‌లో చూడగా కొన్ని వేల క్రిములు ప్రాణాలతో కనిపిస్తాయి.

Viral Video: దుస్తులు మార్చుకునే గదిలో యువతికి వింత సమస్య.. రీల్ చేసే క్రమంలో డోర్ లేకపోవడంతో..


ఆ కొంత మట్టిలోనే అన్ని వేల క్రిములు ఉంటే.. ఇక అన్ని గోర్లలో కలిపి ఎన్ని క్రిములు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! అవి గోర్లా.. లేక క్రిముల కర్మాగారాలా’’.. అంటూ కొందరు, ‘‘వీడియో చూస్తుంటే.. గోర్లు కొరకాలంటేనే భయమేస్తోంది’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: గదిలోకి వెళ్లిన టీచర్‌తో హెచ్ఎం పాడుపని.. వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు..

Updated Date - Jul 11 , 2024 | 08:10 AM