Share News

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Oct 19 , 2024 | 09:51 AM

పాఠశాల, కళాశాల రోజులు జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంటాయి. క్లాస్‌కు డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్లడం, తరగతి గదుల్లో స్నేహితులతో కలిసి అల్లరి చేయడం ఇలా అనేక సంఘటనలు సందర్భానుసారం గుర్తుకువచ్చి సంతోషాన్ని కలిగిస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో

Viral Video:  ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

పాఠశాల, కళాశాల రోజులు జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంటాయి. క్లాస్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లడం, తరగతి గదుల్లో స్నేహితులతో కలిసి అల్లరి చేయడం ఇలా అనేక సంఘటనలు సందర్భానుసారం గుర్తుకువచ్చి సంతోషాన్ని కలిగిస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ విద్యార్థికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విద్యార్థి తరగతి గదిలో చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు ఇతను ఏం చేస్తున్నాడో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తరగతి గదిలో టీచర్ పాఠాలు చెబుతుండగా.. విద్యార్థులంతా శ్రద్ధగా వింటుంటారు. అయితే ఓ విద్యార్థి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాడు. పాఠాలు వినడం పక్కన పెట్టి.. క్లాసు రూములో వంట చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంటి నుంచి తెచ్చుకున్న మరమరాల డబ్బాను ఓపెన్ చేసి పెడతాడు.

Viral Video: పానీపూరీ అంటే ఇష్టమా.. వీళ్లెలా చేస్తున్నారో చూస్తే.. నోరెళ్లబెడతారు..


తర్వాత ఇంకో డబ్బా తీసుకుని, అందులో ఉల్లిపాయ, టమాట తదితరాలను కట్ చేసి వేస్తాడు. అలాగే మసాలా దినుసులను కూడా కలుపుతాడు. ఫైనల్‌గా ఆ డబ్బాలో (student Making Bhel Puri in the classroom) ఉన్న ఉన్న బ్లేడును తాడుతో లాగడం వల్ల లోపల ఉన్నవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతాయి. ఆ తర్వాత వాటిని మరమరాలల్లో కలిపేసి అంతా కలిసేలా డబ్బాను షేక్ చేసి మరీ మిక్స్ చేస్తాడు. ఇలా ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుండగానే.. మరోవైపు ఈ విద్యార్థి భేల్‌ పూరీని సిద్ధం చేశాడన్నమాట.

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..


ఈ ఘటనను అతడి స్నేహితులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతను ఉద్యోగం రాకపోయినా మంచి వంటవాడిగా సెటిల్ అవ్వొచ్చు’’.. అంటూ కొందరు, ‘‘బ్రో.. మొత్తానికి లాస్ట్ బెంచ్ కిచెన్ అని నిరూపించాడు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 55 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. దఢ పుట్టిస్తున్న వీడియో.. ఖడ్గమృగాన్ని ఈ సింహం ఎలా తింటుందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 19 , 2024 | 09:51 AM