Share News

Viral Video: ఈ కోతి మందుబాబులను మించిపోయిందిగా.. చెత్త కుండీపై దాని నిర్వాకం చూడండి..

ABN , Publish Date - Oct 18 , 2024 | 08:04 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రెండు కోతులు ఆహార పదార్థాల కోసం వెతుకుతూ రోడ్డు పక్కన ఉన్న చెత్తకుండీ పైకి ఎక్కుతాయి. వాటిలో ఓ కోతి చెత్త కుండీలో వెతకగా.. అందులో..

Viral Video: ఈ కోతి మందుబాబులను మించిపోయిందిగా.. చెత్త కుండీపై దాని నిర్వాకం చూడండి..
ప్రతీకాత్మక చిత్రం

పిల్లులు, కుక్కలు, కోతులు విచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. అయితే వీటిలో కోతులు తమ విచిత్ర చేష్టలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటాయి. కొన్ని కోతులు కొన్నిసార్లు మనుషులు కూడా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తో్ంది. చెత్త కుండీపై కూర్చున్న కోతికి అనుకోకుండా ఓ మందు బాటిల్ కనిపించింది. దీంతో చివరకు అది చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బ్రెజిల్‌లోని (Brazil) పరానా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు కోతులు ఆహార పదార్థాల కోసం వెతుకుతూ రోడ్డు పక్కన ఉన్న చెత్తకుండీ పైకి ఎక్కుతాయి. వాటిలో ఓ కోతి చెత్త కుండీలో వెతకగా.. (Liquor bottle in Dust bin) అందులో ఆహార పదార్థాలకు బదులుగా ఓ మందు బాటిల్ కనిపిస్తుంది.

Puzzle: రైతు పొలంలో అతడి భార్య, 5 కోళ్లు, రెండు గుర్రాలు ఉంటే.. అక్కడ మొత్తం ఎన్ని అడుగులు ఉన్నాయో చెప్పగలరా..?


మందు బాటిల్‌ను చూడగానే కోతి నోరూరినట్టుంది. ఆహారం తర్వాత ముందు ఈ మందు బాటిల్‌ను ఓ పట్టు పడదాం.. అనుకుంటూ దాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలిస్తుంది. అందులో మద్యం ఉండడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. దాన్ని పైకి ఎత్తి దించకుండా తాగేస్తుంది. పక్కన ఉన్న కోతి విచిత్రంగా చూసింది. ‘‘ఛీ ఛీ నాకు మందు తాగడం అంటే నచ్చదు’’.. అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ కోతి మాత్రం మందు (drunken monkey) బాటిల్‌ను ఖాళీ చేసే వరకూ ఆగదు.

Viral Video: సముద్రంలో కొట్టుకుపోతున్న వృద్ధుడు.. దూరం నుంచి గమనించిన మత్య్సకారుడు.. చివరికి..


రోడ్డు పక్కన ఉన్న వారు ఈ కోతిని విచిత్రంగా చూశారు. కొందరు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మందుబాబులను మించిపోయిందిగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ కోతి మద్యానికి బానిసైంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎక్కడమే కాదు.. దిగడం కూడా తెలియాలి.. ఇతడేం చేశాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 18 , 2024 | 08:04 AM