Share News

Viral Video: వర్షం రావడంతో పెళ్లి మంటపం నుంచి పారిపోయిన అతిథులు.. అయినా వరుడు మాత్రం వేదికపై నిలబడి..

ABN , Publish Date - Jul 16 , 2024 | 08:47 PM

వివాహ కార్యక్రమాల్లో చోటు చేసుకునే అనేక రకాల ఘటనలు.. వీడియోల రూపంలో నెట్టింట ఎంతలా హల్‌చల్ చేస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కళ్యాణ మంటపంలోకి వధూవరులు ఎంటరయ్యే విధానం దగ్గర నంచి...

Viral Video: వర్షం రావడంతో పెళ్లి మంటపం నుంచి పారిపోయిన అతిథులు.. అయినా వరుడు మాత్రం వేదికపై నిలబడి..

వివాహ కార్యక్రమాల్లో చోటు చేసుకునే అనేక రకాల ఘటనలు.. వీడియోల రూపంలో నెట్టింట ఎంతలా హల్‌చల్ చేస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కళ్యాణ మంటపంలోకి వధూవరులు ఎంటరయ్యే విధానం దగ్గర నంచి అనేక రకాల ఘటనలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, వరుడికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వర్షం రావడంతో పెళ్లి మంటపంలో అతిథులంతా పక్కకు పారిపోయారు. అయినా వరుడు మాత్రం వేదికపై ప్రవర్తించిన తీరు చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమం జరుగుతుండగా.. ఉన్నట్టుండి వర్షం (rain) కురుస్తుంది. దీంతో పెళ్లి వేదిక ఎదురుగా కుర్చీల్లో కూర్చున్న అతిథులంతా పక్కకు పారిపోయారు. పెళ్లి మంటపం మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది. వర్షం కురవడంతో అతిథులెవరూ అక్కడ కనిపించలేదు.

Viral Video: జలపాతం వద్ద రహస్యంగా పర్యాటకుల స్నానం.. సైలెంట్‌గా సమీపానికి వెళ్లిన పోలీసులు.. చివరకు..


వర్షం కురుస్తున్న సమయంలో కొందరు మాత్రం అక్కడున్న కొన్ని వస్తువులు తడిచిపోకుండా వాటిపై ప్లాస్టిక్ పట్టలు కప్పుతున్నారు. అయితే ఆ సమయంలో పక్కకు వెళ్లిపోవాల్సిన వరుడు మాత్రం.. అందుకు విరుద్ధంగా పెళ్లి వేదికపై వరుడు ఒక్కడే నిలబడి ఉన్నాడు. వర్షంలో నిలబడడం ఒక ఎత్తైతే.. (Groom's reaction in rain) అతడి ఎక్స్‌ప్రెషన్ చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ‘‘సంతోషంగా పెళ్లి చేసుకుంటుంటే.. మధ్యలో ఈ వర్షం మొత్తం చెడగొట్టేసింది’’.. అన్నట్లుగా అతడు మొఖం దిగాలుగా పెట్టి, అలాగే డల్‌గా నిలబడి ఉండడం చూసి అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.

Viral Video: వరుడి స్నేహితులు ఇచ్చిన బహుమతిని తెరచిన వధువు.. లోపలి వస్తువును చూసి షాక్.. చివరకు ఛీ.. ఛీ.. అంటూ..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘పెళ్లికొడుకును చూస్తే జాలేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘వర్షం తగ్గితే తర్వాత చేసుకోవచ్చు.. ముందు స్టేజిపై నుంచి కిందకు దిగిపో బ్రో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: రోడ్డు పక్కన ప్రేమికుల రొమాన్స్.. కారులో వెళ్తూ కూతురిని చూసిన తండ్రి.. చివరకు..

Updated Date - Jul 16 , 2024 | 08:48 PM