Share News

Viral Video: మహిళల బోగీల్లో యువకులు.. దిగే సమయంలో వారి పరిస్థితి ఎలా ఉందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Oct 22 , 2024 | 09:16 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైళ్లలో మహిళల కోసం బోగీలను కేటాయించడం అందరికీ తెలిసిందే. ఈ బోగీల్లో ప్రయాణిస్తూ పట్టుబడే పురుషులకు రూ.500 జరిమానా విధించడం, లేదా 6 నెలల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. ఇదిలావుండగా..

Viral Video: మహిళల బోగీల్లో యువకులు.. దిగే సమయంలో వారి పరిస్థితి ఎలా ఉందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

రైలు ప్రయాణ సమయాల్లో చోటు చేసుకునే సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటే.. మరికొందరు అసభ్యకర పనులు చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. తాజాగా, రైలు ప్రయాణంలో చోటు చేసుకున్న వినూత్న ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు యువకులు మహిళల బోగీల్లో ఎక్కారు. అయితే రైలు దిగే సమయంలో జరిగిన ఘటన చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైళ్లలో మహిళల కోసం బోగీలను కేటాయించడం అందరికీ తెలిసిందే. ఈ బోగీల్లో ప్రయాణిస్తూ పట్టుబడే పురుషులకు రూ.500 జరిమానా విధించడం, లేదా 6 నెలల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. ఇదిలావుండగా, తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో చాలా మంది పురుషులు మెట్రో రైల్లో మహిళలకు (women compartment) కేటాయించిన బోగీలోకి ఎక్కారు.

Optical illusion: ఈ చిత్రంలో గడియారం ఎక్కడుందో 20 సెకన్లలో కనిపెడితే.. మీ కళ్లు బాగున్నట్లే..


ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఫిర్యాదు అందుకున్న రైల్వే పోలీసులు (Railway Police) అవతలి స్టేషన్‌లో రెడీగా ఉన్నారు. సదరు స్టేషన్‌లో బోగీ డోర్లు తెరుచుకోగానే ఎదురుగా పోలీసులు కనిపించే సరికి వాళ్లంతా షాక్ అయ్యారు. వారిని ఒక్కొక్కరికిగా కిందకు దింపుతూ చితకొట్టేశారు. ఇలా లోపల ఉన్న వారందరినీ ఒక్కొక్కరిగి చితకబాదుతూ బయటికి పంపించారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Viral Video: ఈగలకు తెలీకుండా తేనె చోరీ.. ఇతడి టెక్నిక్ ఏంటో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పోలీసుల ట్రీట్‌మెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారికి ఇలాగే జరగాలి’’.. అంటూ మరికొందరు, ‘‘భార్య కారణంగా ఓ వ్యక్తి దెబ్బలు తప్పాయి’’.. అంటూ ఇంకొందరు, ఫన్నీ ఫన్నీ కామెంట్లతో పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1200కి పైగా లైక్‌లు, 79 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఇలాంటి సీన్లు సినిమాల్లోనే చూస్తుంటాం.. బావిలో నుంచి కొండచిలువలను ఎలా బయటికి తీస్తున్నాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 22 , 2024 | 09:16 AM